ట్విట్టర్ డేటా, ఫేక్ అకౌంట్ల ఇన్ఫో ఇవ్వండి.. లేదంటే డీల్ నుంచి వైదొలుగుతా: ఎలాన్ మాస్క్
సోషల్ మీడియా దిగ్గజం.. ట్విట్టర్ కొనుగోలుపై ఎలాన్ మస్క్ దాగుడు మూతలు అంటున్నారు. ఇప్పటికే 44 బిలియన్ డాలర్లకు ఒప్పందం జరిగింది. అయితే మస్క్ మాత్రం తనకు స్పామ్ డేటా, ఫేక్ అకౌంట్ల గురించిన సమాచారం కావాలని అడుగుతున్నారు. అవీ ఇస్తేనే కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని స్పష్టంచేశారు.. లేదంటే వైదొలుగుతానని తేల్చిచెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ యజమాన్యానికి లేఖ రాశారు.

ట్విట్టర్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కోసం జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా వ్యవహరించాలని మాస్క్ కోరుతున్నారు. అందుకే అప్పుడప్పుడు రకరకాల స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడే కాదు మార్చిలో కూడా ట్విట్టర్ డీల్ నుంచి వైదొలుగుతున్న అని కామెంట్ చేశారు. ఇప్పుడు డేటా గురించి అడుగుతున్నారు. లేదంటే కొనుగోలు ప్రక్రియ నుంచి వైదొలుగుతున్న అని కామెంట్ చేశారు.
అంతకుముందు టెస్లా సీఈవోగా ఉన్న ఎలన్ మస్క్ త్వరలో ట్విట్టర్ బాధ్యతలు చూసుకుంటారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటు ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేశాక తమ భవిష్యత్ పై ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. తన సంస్థలో ఉద్యోగ భద్రత లేదనుకునేవాళ్లు వెళ్లిపోయినా తనకేమీ అభ్యంతరం లేదని మస్క్ అన్నారు. ఇంతలోనే డీల్ నుంచి వెళతా అని బెదిరిస్తున్నారు. ఒకవేళ మాస్క్ కొనుగోలు చేస్తే ట్విట్టర్ భవిష్యత్ ఏంటీ అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమ జాబ్స్ సెక్యూరిటీ ఏదీ అని అడుగుతున్నారు.












Click it and Unblock the Notifications