ప్రపంచంలో తొలి ట్రిలియనీర్ కాబోతున్న ఎలాన్ మస్క్ ? రెండో ట్రిలియనీర్ గా భారతీయుడు..!
ప్రపంచ కుబేరుల జాబితాలో మరో అద్బుతం జరగబోతోంది. ఇప్పటివరకూ ఈ భూమిపై బిలియనీర్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు కొత్తగా ట్రిలియనీర్లు ఆవిర్భవించబోతున్నారు. ఇందులో తొలి ట్రిలియనీర్ గా ఇప్పటికే ప్రపంచ కుబేరుడిగా ఉన్న టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ చరిత్రకెక్కబోతున్నారు. ఆ తర్వాత స్ధానంలో భారత్ కు చెందిన దిగ్గజ వ్యాపారవేత్త గౌతం అదానీ నిలవబోతున్నారు. దీంతో ప్రపంచం దృష్టంతా ఇప్పుడు వీరిద్దరిపైనే ఉంది.
దుబాయ్ కు చెందిన ఇన్ ఫార్మా కనెక్ట్ అకాడమీ తాజా అధ్యయనం ప్రకారం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 2027 నాటికి తన సంపదను మరింతగా పెంచుకుని తొలి ట్రిలియనీర్ గా ఆవిర్భవించబోతున్నట్లు అంచనా వేసింది. ఇప్పటికే ప్రతీ ఏటా తన సంపదను ఏకంగా 110 శాతం చొప్పుున పెంచుకుంటూ పోతున్న ఎలాన్ మస్క్ జస్ట్ మూడేళ్లలో ప్రపంచంలో తొలి ట్రిలియనీర్ కాబోతున్నట్లు తెలిపింది. అతని ప్రస్తుత సంపద ఏకంగా 241 బిలియన్ డాలర్లు ఉన్నట్లు బ్లూమ్ బర్గ్ తెలిపింది.

ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలో రెండో ట్రిలియనీర్ గా ఆవిర్భవించే అవకాశం భారత్ కు చెందిన అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీకి ఉన్నట్లు దుబాయ్ సంస్థ అధ్యయనం తేల్చింది. అయితే 2028 నాటికి గౌతం అదానీ ట్రిలియనీర్ల జాబితాలో రెండో వ్యక్తి కానున్నట్ల అంచనా వేస్తోంది. అదానీ ఆస్తుల వార్షిక వృద్ధిరేటు ఎలాన్ మస్క్ కంటే వేగంగా ఏడాదికి 123 శాతం చొప్పున పెరుగుతున్నట్లు తెలిపింది. నివిడా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్, మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ వంటి కుబేరులు సైతం 2030 నాటికి ట్రిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించే అవకాశమున్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications