కలలో కూడా అనుకోలేదు: సీఈఓకు ఉద్యోగుల సర్‌ప్రైజ్ గిఫ్ట్ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

తన కంపెనీలో పనిచేస్తున్న 120 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికీ ఏడాదికి కనీసం 70 వేల డాలర్లు (రూ. 46.97 లక్షలు) జీతాన్ని పెంచుతూ అసాధారణమైన నిర్ణయాన్ని తీసుకున్న గ్రేవిటీ కంపెనీ సీఈఓ డాన్ ప్రైస్‌కు ఆ సంస్ధ ఉద్యోగులు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

తమ జీతాల్లో కొంతమొత్తాన్ని దాచిపెట్టి ఆయనకు ఎంతో ఇష్టమైన అత్యంత ఖరీదైన 'టెల్సా' కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో ఆనందంలో మునిగిపోయిన ఆయన 'దీనిని నేను నమ్మలేకపోతున్నాను. షాక్ తిన్నాను. ఇలాంటి ఒకటి జరగుతుందని కలలో కూడా అనుకోలేదం'టూ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

డాన్ ప్రైస్ ఇటీవల తన వేతనాన్ని 11 లక్షల డాలర్ల నుంచి 70 వేల డాలర్లకు తగ్గించుకున్నారు. ఆ మొత్తాన్ని ఉద్యోగుల వేతనాలకు బదలాయించారు. గ్రేవిటీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కనీసం ఏడాదికి 70 వేల డాలర్ల జీతం ఉండాలని ఆయన తీసుకున్న ప్రపంచ వ్యాప్తంగా అందరినీ విస్మయానికి గురిచేసింది.

కాగా గ్రేవిటీ కంపెనీలో 30 శాతం వాటా కలిగిన ఆయన తన సోదరుడి నుంచే కేసు ఎదుర్కొంటున్నారు. గ్రేవిటీ కంపెనీ సీఈఓగా ఉన్న ప్రైస్ ఎక్కువ వేతనాన్ని పొందుతున్నాడని ప్రధాన వాటాదారుడైన ఆయన సోదరుడు కేసు వేశారు. ఈ కేసు చివరిదశలో ఉండటంతో గ్రేవిటీ ఉద్యోగులకు ఊహించనిరీతిలో వేతనాలను పెంచేశాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dan Price gained worldwide attention when he raised wages of 120 of his emloyees to a minimum of $ 70,000 in a year. According to reports, his employees saved up for months to buy their CEO their dream car a Tesla.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి