భారత్ తో యుద్ధం వస్తే అక్కడికి పారిపోతా..! పాకిస్తాన్ ఎంపీ కామెంట్స్ వైరల్..!

భారత్-పాకిస్తాన్ మధ్య పహల్గాం దాడి తర్వాత ఉద్రికతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇరుదేశాలూ ఆంక్షలు విధించుకోవడం, ఒప్పందాలు నిలిపివేయడం, దిగుమతుల రద్దు వంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో ఏ క్షణమైనా పాకిస్తాన్ పై భారత్ దాడి చేయొచ్చన్న చర్చ ఇరుదేశాల్లోనూ సాగుతోంది. అంతే కాదు భారత్-పాక్ యుద్ధం వస్తే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఇదే క్రమంలో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు షేర్ అఫ్జల్ ఖాన్ మర్వత్ ను కూడా భారత్-పాకిస్తాన్ యుద్దంపై ఓ విలేకరి ఓ ప్రశ్న అడిగారు. ఇరుదేశాల మధ్య యుద్ధం వస్తే మీరు సరిహద్దులకు వెళ్లి పోరాడతారా అంటూ ఆయన్ను ప్రశ్నించాడు. దీనికి అఫ్జల్ ఇచ్చిన స్పందన చూసి సదరు విలేకరి సైతం షాకయ్యాడు. ఈ వీడియో ఇప్పుడు పలు దేశాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ సదరు ఎంపీ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా ? భారత్ తో యుద్దమే కానీ వస్తే తాను ఇంగ్లాండ్ వెళ్లిపోతానన్నాడు.

escape to England if war breaks out with india Pakistan mp s comments viral


భారత్ తో యుద్దం వస్తే ఇంగ్లాండ్ కు వెళ్లిపోతానంటూ పాకిస్తాన్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే పాకిస్తాన్ లో రాజకీయ నాయకులు సైతం ఆర్మీని నమ్మడం లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత్ పై యుద్ధానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ పాలకులు ఆర్మీ సామర్ధ్యం విషయంలో ఎక్కడా మాట్లాడటం లేదు. దీంతో కేవలం మాటలతో భారత్ ను కవ్వించేందుకు వీరు ప్రయత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే పాకిస్తాన్ నేతల మాటల్ని భారత్ సీరియస్ గా తీసుకుంటే మాత్రం ఆ దేశానికి సమస్యలు తప్పవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+