అమెరికాకు ఐరోపా దిమ్మదిరిగే షాక్..! ట్రంప్ బ్లాక్ మెయిలింగ్ బూమరాంగ్..!
గ్రీన్ ల్యాండ్ ఆక్రమణ విషయంలో తనకు మద్దతివ్వని యూరప్ దేశాలపై సుంకాలతో బెదిరింపులకు దిగుదామని అనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓవైపు యూరప్ దేశాలతో వ్యాపారం కోసం ఒప్పందాలు చేసుకుంటూ.. మరోవైపు వారిపైనే సుంకాలు విధిస్తానని బెదిరింపులకు దిగడంతో ట్రంప్ కు ఆయా దేశాలు షాకిచ్చాయి.
అమెరికాతో కుదుర్చుకుంటున్న ట్రాన్స్ అట్లాంటిక్ వాణిజ్య ఒప్పందానికి బ్రేక్ వేశాయి.
గ్రీన్ ల్యాండ్ ఆక్రమణకు వేగంగా పావులు కదుపుతున్న ట్రంప్.. వెనెజులా అధ్యక్షుడు మదురోపై దాడి చేసి ఎత్తుకొచ్చిన ఘటనను వారికి గుర్తు చేస్తున్నారు. అయితే యూరప్ దేశాలు మాత్రం ఈ బెదిరింపులకు లొంగేందుకు సిద్దంగా లేవు. దీంతో గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ బెదిరింపులకు నిరసనగా.. యూరోపియన్ పార్లమెంట్ ఇవాళ అమెరికాతో గత జూలైలో సంతకం చేసిన వాణిజ్య ఒప్పందం అమలుకు బ్రేక్ వేసింది.

ట్రంప్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మధ్య గత జూలైలో వాణిజ్య ఒప్పందం కుదిరింది.
దీని ప్రకారం ఈయూ వస్తువులపై అమెరికా సుంకాలను 15 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించారు. బ్లాక్ అమెరికన్ ఎగుమతులపై సుంకాలను కూడా తగ్గించారు. అయితే ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ కబ్జా కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఈ ఒప్పందం భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేశాయి.

ఈ వారం ఆర్కిటిక్ ద్వీపమైన గ్రీన్ ల్యాండ్ లో మోహరింపు కోసం దళాలను పంపిన యూరోపియన్ దేశాలపై ట్రంప్ అదనంగా 10 శాతం సుంకాన్ని ప్రకటించారు. జూన్ 1 నుండి ఇది 25 శాతానికి పెరుగుతుందని, గ్రీన్‌ల్యాండ్ యొక్క పూర్తి కొనుగోలు కోసం ఒక ఒప్పందం కుదిరే వరకు అమలులో ఉంటుందని తెలిపారు. ఉత్తర అట్లాంటిక్‌లో పెరుగుతున్న రష్యన్, చైనా కార్యకలాపాలపై ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ మోహరింపు జరిగిందని, అమెరికాను రెచ్చగొట్టే ప్రయత్నం కాదని యూరోపియన్ నాయకులు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సుంకాలు కొనసాగితే ఈయూ ఉమ్మడి ప్రతిస్పందన కూడా గట్టిగానే ఉంటుందని నేతలు తాజాగా కౌంటర్ ఇచ్చారు.
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications