వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేహితురాలి హత్య: ఫేస్‌బుక్‌ సెల్ఫీనే పట్టించింది!

|
Google Oneindia TeluguNews

ఒట్టావా: ఓ యువతిని ఆమె స్నేహితురాలే మద్యం మత్తులు హత్య చేసింది. ఈ కేసును రెండేళ్ల తర్వాత పోలీసులు ఛేదించడం గమనార్హం. అయితే, హత్యకు ముందు వారిద్దరూ దిగిన సెల్ఫీ ఫొటోనే నిందితురాలిని పట్టించడం గమనార్హం. ఈ ఘటన కెనడాలో చోటు చేసుకుంది.

తల్లి ప్రేమ: శివగామిలా! ప్రాణాలు పోతున్నా క్షణాల్లో కొడుకును కాపాడిందితల్లి ప్రేమ: శివగామిలా! ప్రాణాలు పోతున్నా క్షణాల్లో కొడుకును కాపాడింది

వివరాల్లోకి వెళితే.. చెయెన్నె రోస్ ఆంటోనీ(21) అనే యువతి తన స్నేహితురాలు బ్రిట్నీ గార్గోల్(18)ని రెండేళ్ల క్రితం హత్య చేసింది. ఈ కేసు సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఎట్టకేలకు వారు(బాధితురాలు, నిందితురాలు) తీసుకున్న సెల్ఫీ సాయంతో కేసును ఛేదించారు.

హత్యకు ముందు సెల్ఫీ

హత్యకు ముందు సెల్ఫీ

సాస్కాచ్‌వెన్ ప్రాంతంలో బ్రిట్నీ గార్గోల్‌ను ఆంటోనీ తన బెల్టుతో మెడకు గట్టిగా బిగించి చంపేసింది. ఆమె మృతదేహం వద్దే బెల్టును పడేసి వెళ్లిపోయింది. అయితే, ఆంటోనీ అదే బెల్ట్ పెట్టుకుని బ్రిట్నీతో కలిసి అంతకుముందు దిగిన సెల్ఫీని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.

 సెల్ఫీ సాయంతో..

సెల్ఫీ సాయంతో..

బ్రిట్నీ హత్యకు కొన్ని గంటల ముందే వారు ఆ సెల్ఫీ దిగడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. తమదైన శైలిలో విచారించి ఆంటోనీని నిందితురాలిగా తేల్చారు. చివరకు తానే బ్రిట్నీని హత్య చేసినట్లు ఆంటోనీ కూడా ఒప్పుకుంది.

 మద్యం సేవించి..

మద్యం సేవించి..

ఆ రోజు తామిద్దరం మద్యం సేవించామని, ఆ తర్వాత మాట మాట పెరిగి ఆవేశంలో బ్రిట్నీని చంపేసినట్లు ఆంటోనీ చెప్పింది. అప్పుడు ఏం జరిగిందో తనకు గుర్తుకు లేదని చెప్పుకొచ్చింది.

 క్షమించుకోలేను

క్షమించుకోలేను

ఈ హత్యకు పాల్పడి ఘోరమైన తప్పిదం చేశానని, తనను తాను ఎప్పటికీ క్షమించుకోలేనని ఆంటోనీ చెప్పింది. ఈ వేదన తనను ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటుందని తెలిపింది. కాగా, కోర్టు నిందితురాలు ఆంటోనీకి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

English summary
A Canadian woman has been convicted of killing her friend after police discovered the murder weapon used in a picture of the pair on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X