వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ పాస్‌వర్డ్ వేరెవ్వరికీ తెలియదని సంబర పడుతున్నారా .. ? వాళ్లు అన్నీ చూసేశారు

|
Google Oneindia TeluguNews

మీ ఫేస్‌బుక్ పాస్‌వర్డ్ మీకు మాత్రమే తెలుసు అని ఫీల్ అవుతున్నారా? మీ పాస్‌వర్డ్ తెలిసినవారు వేరే వారు ఉన్నారు అంటే మీకు నమ్మశక్యంగా లేదా ? మీరు నమ్మలేకున్నా ఇది నిజం. మీ ఫేస్ బుక్ పాస్‌వర్డ్ తెలిసినవారు ఇంకా చాలామంది ఉన్నారని స్వయానా ఫేస్ బుక్ ఒప్పుకుంది.

ఎలక్షన్ కమీషన్ కూ సోషల్ మీడియా ఎఫెక్ట్ .. అసత్య వార్తలపై సీరియస్ .. తొలగింపుకు చర్యలుఎలక్షన్ కమీషన్ కూ సోషల్ మీడియా ఎఫెక్ట్ .. అసత్య వార్తలపై సీరియస్ .. తొలగింపుకు చర్యలు

ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమస్ సోషల్ నెట్వర్కింగ్ యాప్. ఈ యాప్ లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు తమ అకౌంట్ భద్రత కోసం పాస్‌వర్డ్ పెట్టుకుంటారు. తమకు తప్ప వేరే ఎవరికీ తెలియకూడదు అని చాలా జాగ్రత్తగా పాస్‌వర్డ్ ను సెట్ చేసుకుంటారు. ఇక తమ పాస్‌వర్డ్, తమ అకౌంటు పదిలం గా ఉందని, తమ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరూ చూసే అవకాశం లేదని సంబరపడిపోతూ ఉంటారు. కానీ అక్కడే తప్పులో కాలేస్తున్నారు. మీ ఫేస్‌బుక్ పాస్‌వర్డ్స్ సేఫ్ గా లేవు అంతే మీరు నమ్మలేరు కదా .. కానీ మీ ఫేస్‌బుక్ పాస్‌వర్డ్ కు సంబంధించి ఏం జరిగిందో చెప్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.

Facebook Stored Millions of User Passwords in Plain Text for Years

కోట్లాది మంది ఫేస్‌బుక్ వినియోగదారుల యూజర్ల పాస్‌వర్డ్ ఫేస్ బుక్ ఉద్యోగులకు తెలుసట.. వారు యూజర్ల పాస్‌వర్డ్స్ అన్నీ చూసేశారట. సెక్యూరిటీ స్లిప్ వల్ల యూజర్ల పాస్‌వర్డ్స్ ను ఫేస్‌బుక్ ఉద్యోగుల చూశారని స్వయాన ఫేస్‌బుక్ ఒప్పుకుంది. పాస్‌వర్డ్స్ ను టెక్స్ట్ రూపంలో దాచినట్టు వెల్లడించింది. బయట వారెవరికీ తెలిసే ఛాన్స్ లేదని , నేటి వరకు ఎవరు పాస్‌వర్డ్స్ ను దుర్వినియోగం చేయలేదని ఫేస్‌బుక్ ఇంజనీరింగ్ మరియు సెక్యూరిటీ వైస్ ప్రెసిడెంట్ పెడ్రో కనాహువాటి తెలిపారు. ఏది ఏమైనా వాళ్ళు దుర్వినియోగం చెయ్యటం లేదు అని చెప్పినా మన ఫేస్‌బుక్ అకౌంట్స్ కు సేఫ్టీ లేదని అర్ధం అయ్యింది. మనం ఎంతో గుట్టుగా దాచుకునే పాస్‌వర్డ్స్ అన్నీ వాళ్ళ దగ్గర వున్నాయని తెలిసిపోయింది .

English summary
millions of Facebook users had their account passwords stored in plain text and searchable by thousands of Facebook employees — in some cases going back to 2012, KrebsOnSecurity has learned. Facebook says an ongoing investigation has so far found no indication that employees have abused access to this data.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X