వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలెర్ట్: ఈనెల 8న భూమికి ముప్పు -అదుపుతప్పి దూసుకొస్తున్న చైనా రాకెట్ -ఎక్కడ పడుతుందో తెలీదు..

|
Google Oneindia TeluguNews

కరోనా పుట్టినిల్లు చైనా మరో రకంగానూ ప్రపంచాన్ని వణికిస్తున్నది. అక్కడి వూహాన్ నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం అన్ని దేశాలనూ కబళించి, ఏకంగా 33 లక్షల మందిని పొట్టనపెట్టుకోవడం తెలిసిందే. ఇప్పటికే 16కోట్లకు చేరువైన ఇన్ఫెక్షన్ల సంఖ్య అంతులేకుండా పెరుగుతూనే ఉన్నది. కొవిడ్ విలయం నుంచి తేరుకోకముందే డ్రాగన్ చైనా ప్రపంచం నెత్తిన మరో పిడుగు పడేసింది..

Recommended Video

Chinese Rocket ‘Out Of Control’ Falling to Earth భూమికి ముప్పు... ఎక్కడ పడుతుందో ? | Oneindia Telugu

షాకింగ్: చంద్రబాబు చెప్పిందే జరిగింది -ఏపీ ప్రాణాంతక 'ఎన్‌440కే వేరియంట్‌’ -ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులు సీజ్షాకింగ్: చంద్రబాబు చెప్పిందే జరిగింది -ఏపీ ప్రాణాంతక 'ఎన్‌440కే వేరియంట్‌’ -ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులు సీజ్

దూసుకొస్తోన్న చైనా రాకెట్..

దూసుకొస్తోన్న చైనా రాకెట్..

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్, అమెరికాకు దీటుగా ప్రయోగాలు చేస్తోన్న చైనా సరైన ప్రమాణాలు, జాగ్రత్తలు పాటించడం లేదనే ఆరోపణలు గతం నుంచీ ఉన్నాయి. ఆ ఆరోపణలు వాస్తవమే అనడానికి రుజువుగా ప్రస్తుతం ఓ విపత్కర పరిస్థితి తలెత్తింది. చైనా అంతరిక్షంలోకి పంపిన ఓ రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమివైపు దూసుకొస్తోంది. అది ఏ క్షణమైనా భూమిని తాకొచ్చని సైంటిస్టులు చెప్పారు. సాధారణంగా కూలిపోయిన రాకెట్లు సముద్రంలో పడుతుంటాయి. కానీ..

ఈనెల 8న ఎక్కడ పడుతుందో..

ఈనెల 8న ఎక్కడ పడుతుందో..

నిర్దేశిత ప్రమాణాలు పాటించకుండా చైనా ప్రయోగించిన 'లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌' బెడిసికొట్టింది. అది సముద్రలో కాకుండా నేరుగా భూతలంపైనే పడబోతున్నది. అది ఎక్కడ పడుతుందో ప్రస్తుతానికి చెప్పలేమని సైంటిస్టులు అంటున్నారు. అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్ ప్రస్తుతం లాంగ్ మార్చ్ 5బీ రాకెట్‌ను ట్రాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆ రాకెట్ నెల 8న రాకెట్ భూమ్మీదకు వచ్చే అవకాశం ఉందని పెంటగాన్‌ సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే అది సరిగ్గా ఏ ప్రదేశంలో భూ వాతవరణంలోకి ప్రవేశిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు.

డ్రాగన్ బాధ్యతారాహిత్యం..

డ్రాగన్ బాధ్యతారాహిత్యం..


అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు విడిగా అంతరిక్షంలో సొంత కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోన్న చైనా ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌ నిర్మించడం కోసం లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌ తియాన్హే స్పేస్‌ మ్యాడుల్‌ను అంతరిక్షంలోని 300 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి చేర్చింది. సుమారు 21 టన్నుల బరువున్న ఆ రాకెట్ మొదటి మాడ్యూల్‌ విడుదలలో లోపాలు తలెత్తి నియంత్రణ కోల్పోయింది. ఇప్పుడా రాకెట్ శకలాలు భూమి మీదకు దూసుకొస్తున్నాయి. స్పేస్ లో నిర్దేశిత ప్రమాణాలను చైనా పాటించని కారణంగానే ఈ విలయం తలెత్తిందని అమెరికా ఆరోపిస్తున్నది.

English summary
The White House has called for “responsible space behaviours” as a Chinese rocket, thought to be out of control, looks set to crash back to Earth on Saturday, US time. The US Space Command is tracking debris from the Long March 5B, which last week launched the main module of China’s first permanent space station into orbit. The roughly 30-metre (100ft) long stage would be among the biggest space debris to fall to Earth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X