భారతీయ యువత నెత్తిన ట్రంప్ పిడుగు.. వాళ్లకు కొత్త కష్టం
యుఎస్ లో ఉంటున్న భారతీయులు ట్రంప్ తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్న ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాకుండా ఉంది. ఇప్పటికే వలసదారులను దేశం నుంచి సాధ్యమైనంత వేగంగా బహిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్న ట్రంప్ సర్కార్, అమెరికా వీసా, గ్రీన్ కార్డు దారులపైన పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తోంది.
ట్రంప్ నిర్ణయాలతో అందరికీ భయం
ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రంప్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారి వీసాలు, గ్రీన్ కార్డులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన అమెరికా సర్కార్ సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన కూడా నిఘా పెంచింది. ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో గ్రీన్ కార్డు హోల్డర్లు, హెచ్ వన్ బి వీసా దారులు, హెచ్ 4 వీసా దారులు, ఐ 140 ఉన్నవారు ప్రతి ఒక్కరు భయపడుతున్న పరిస్థితి ఉంది.

గందరగోళంలో యూఎస్ లో ఉన్న భారతీయులు
ఇక ఎఫ్ 1 వీసాదారుల పరిస్థితి అయితే మరీ దారుణం. వివిధ యూనివర్సిటీలలో చదువుకోడానికి అక్కడికి వెళ్లిన విద్యార్థులు ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న షాకింగ్ నిర్ణయాలతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎప్పుడు, ఎవరిని, ఏవిధంగా, ఏ నిర్ణయాలతో ట్రంప్ దేశం నుంచి గెంటేస్తాడో అర్థంకాని పరిస్థితిలో ప్రస్తుతం యుఎస్ లో ఉన్న భారతీయులందరూ గందరగోళంలో పడ్డారు.
ట్రంప్ రాకతో పెళ్ళిళ్ళ విషయంలో తలక్రిందులుగా పరిస్థితి
ఈ పరిస్థితి యూఎస్ లో ఉంటున్న వారి పెళ్లిళ్ల విషయంలో కూడా తీవ్ర సందిగ్ధతకు కారణంగా మారింది. నిన్న మొన్నటి వరకు యూఎస్ లో ఉన్నవాళ్లు పెళ్లి చేసుకోవాలంటే యూఎస్ లో ఉన్న అబ్బాయినో, అమ్మాయినో వెతుక్కొని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకునేవారు. కానీ ట్రంప్ రాకతో ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది.
ఉద్యోగాలకే భరోసా లేకుంటే పెళ్లి ఎలా?
ఎవరి ఉద్యోగాలకు భరోసా లేని పరిస్థితుల్లో అబ్బాయిలు ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూడటం పైన విముఖతను వ్యక్తం చేస్తున్నారు. ఇక అమ్మాయిలు కూడా యూఎస్ లో ఉన్నారు అంటే పెళ్లి సంబంధాల విషయంలో భయపడుతున్నారు. దీంతో యుఎస్ లో ఉన్న అబ్బాయిలకు, అమ్మాయిలకు పెళ్లి చేయడం తల్లిదండ్రులకు కష్టంగా మారుతుంది.
యూఎస్ లో ఉన్న భారతీయ యువత పెళ్లి ఆశలపై నీళ్ళు
త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎలా పెళ్లి చేసుకోవాలని అక్కడి వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితులు కుదుటపడిన తర్వాత ఆలోచించవచ్చు అని పెళ్లిళ్లను కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఈ పరిస్థితికి త్వరలో చెక్ పడుతుందా అన్నది కూడా అనుమానంగానే కనిపిస్తుంది. ఇక ట్రంప్ నిర్ణయాలతో చోటు చేసుకుంటున్న భయాలు యువత పెళ్లి ఆశలపైన కూడా నీళ్లు చల్లాయి.
-
ఇరాన్ వార్ ఆపేద్దాం సార్..? ట్రంప్ కు సలహాదారుల షాక్.! -
యుద్ధం ముగుస్తుందా? ఇరాన్‌పై ట్రంప్ సంచలన ప్రకటన! -
ఆ వెబ్‌సైట్‌నే నమ్ముకున్న "ఇజ్రాయెల్" ప్రజలు.. ఏ పని అయినా ఆ తర్వాతే ?? -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!!












Click it and Unblock the Notifications