ట్రంప్ టవర్స్‌లో అగ్నిప్రమాదం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: న్యూయార్క్ లోని ట్రంప్ టవర్స్ లో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. అయితే ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అధికారులు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పతున్నారు.

ఈ భవనంపై ఉన్న ఎలక్ట్రికల్ బాక్స్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరకొని మంటలను ఆర్పుతున్నారు.

Fire at Trump Tower in New York

ఈ భవనంలోని మొదటి మూడు అంతస్థులో ట్రంప్ కుటుంబం నివసించేది. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన వైట్ హౌజ్ కు తన మకాన్ని మార్చారు.అయితే ఇప్పటివరకు ఎలాంటి నష్టం సంభవించలేదని అధికారులు ప్రకటించారు.

ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. మంటలు అదుపులోకి  వచ్చాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A part of Trump Tower in midtown Manhattan is on fire. It appears to be contained to a small penthouse on one of the upper floors.So far there is no word on injuries.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి