అల్లరి చేస్తున్నారంటూ 5గురు చిన్నారులను చంపేశాడు

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని వ్యక్తి ఐదుగురు చిన్నారులను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన మహిళపైనా దాడి చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాయ్‌ ప్రాకన్‌ జిల్లా నాంగ్‌బువా ప్రాంతానికి చెందిన అసపా సీవువా(24) అనే వ్యక్తికి కొంతకాలంగా మతిస్థిమితం సరిగాలేదు. కొద్ది రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు.

అక్కడి నుంచి ఇంటికి వచ్చిన అతనికి ఇంటి బయట ఐదుగురు చిన్నారులు ఆడుకుంటూ కనిపించారు. అల్లరి చేస్తున్నారంటూ.. వెంటనే వంటగదిలోకి వెళ్లి ఒక కత్తి తీసుకువచ్చి.. ఒకరి తర్వాత ఒకరిని కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు.

Five children hacked to death by neighbour in Thailand, police say

అది గమనించిన ఓ మహిళ అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. ఆమెపై కూడా దాడి చేశాడు. మృతిచెందిన చిన్నారుల్లో 5 నెలల పసివాడు కూడా ఉన్నాడు.

మిగిలిన చిన్నారులంతా 8నుంచి 10 ఏళ్లలోపు వాళ్లే. ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. గాయాలపాలైన గర్భిణి మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+