ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నులు 2024: టాప్‌లో ఆ కుటుంబం; టాప్ 10లో ముఖేష్ అంబానీ!!

ఫోర్బ్స్ 2024 సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టెస్లా , సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' అధినేత ఎలాన్ మస్క్ కు మళ్ళీ షాక్ తగిలింది. ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో ప్రపంచ సంపన్నుడిగా ఈసారి కూడా అయన నిలువలేకపోయారు. ఈ సంవత్సరం కూడా బెర్నార్డ్ అర్నాల్ట్ ఫ్యామిలీ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది.

ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో టాప్ 1 లో ఈయనే
2024 ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో మళ్ళీ ఎలాన్ మస్క్ ను వెనక్కు నెట్టి ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ అయిన ఎల్వీఎంహెచ్ బెర్నార్డ్ అర్నాల్ట్ టాప్ వన్ పొజిషన్లో నిలిచారు. ఆయన కుటుంబం 233 బిలియన్ డాలర్ల సంపదతో సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

Forbes world richest 2024 Bernard Arnault family at the top Mukesh Ambani in Top 10

ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ స్థానాలివే
ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో టాప్ 2 లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 195 బిలియన్ల డాలర్ల నికర సంపదతో నిలిచారు. 194 బిలియన్ డాలర్ల నికర సంపదతో జెఫ్ బెజోస్ మూడవ స్థానంలో నిలువగా, నాలుగవ స్థానంలో మార్క్ జుకర్ బర్గ్ 177 బిలియన్ డాలర్ల సంపదతో నిలిచారు.

బిల్ గేట్స్ స్థానం ఇదే
ఐదవ స్థానంలో లారీ ఎలిసన్ 141 బిలియన్ డాలర్ల నికర సంపదతో నిలువగా, వారెన్ బఫెట్ 133 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆరవ స్థానాన్ని దక్కించుకున్నారు. బిల్ గేట్స్ 128 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఏడవ స్థానంలో ఉండగా, స్టీవ్ బాల్మేర్ 121 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఎనిమిదవ స్థానాన్ని సంపాదించారు.

Forbes world richest 2024 Bernard Arnault family at the top Mukesh Ambani in Top 10

వరల్డ్ బిలియనీర్స్ లో టాప్ టెన్ లో ముకేష్ అంబానీ
ఇక భారతీయ అపరకుభేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ 116 బిలియన్ డాలర్ల నికర సంపదతో 9వ స్థానంలో నిలిచారు. ముకేష్ అంబానీ టాప్ టెన్ ప్రపంచ సంపన్నుల లో ఒకరిగా నిలిచారు. లారీ పేజ్ 114 బిలియన్ డాలర్ల నికర సంపదతో 10వ స్థానాన్ని దక్కించుకున్నారు.

2024లో ప్రపంచంలో మొత్తం బిలియనీర్ల సంపద ఎంతంటే
ఇదిలా ఉంటే 2024లో రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 2,781 మంది బిలియనీర్లు ఉన్నారని ఫోర్బ్స్ ప్రకటించింది. గత సంవత్సరం కంటే ఈ సంఖ్య 141 మంది ఎక్కువగా ఉన్నట్టు ఫోర్బ్స్ పేర్కొంది. ఈ సంవత్సరం లిస్టులోని మొత్తం బిలియనీర్ల సంపద 14.2 ట్రిలియన్ డాలర్లుగా ఉందని వెల్లడించింది. ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలోని బిలియనీర్ల సంపద మొత్తం 11.8 కోట్ల కోట్లుగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+