భారత్ తో సంబంధాలు పునరుద్దరిస్తావా లేదా ? మాల్దీవుల అధ్యక్షుడిపై తీవ్ర ఒత్తిడి..!
భారత ప్రధాని మోడీపై తమ మంత్రుల విమర్శల తర్వాత చెదిరిపోయిన సంబంధాల పునరుద్ధరణకు మాల్దీవుల ప్రభుత్వంపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. మోడీపై విమర్శలు చేసిన మంత్రుల్ని తొలగించినా వారి విమర్శల తర్వాత జరిగిన నష్టాన్ని పూరించేందుకు ప్రత్నాలు చేయకుడా చైనాలో పర్యటనలు చేసిన అధ్యక్షుడు మొయిజుపై స్వదేశంలో విమర్శల దాడి మరింత పెరిగింది. భారత్ కు అనుకూలుడిగా పేరున్న విపక్ష నేత మొహమ్మద్ సాలిహ్ తాజాగా అధ్యక్షుడికి కీలక సూచనలు చేశారు.
భారత్ విషయంలో మొండిగా వ్యవహరించవద్దని, ఆ దేశంతో సంబంధాలు తమకు చాలా ముఖ్యమని మాజీ అధ్యక్షుడు కూడా అయిన మొహమ్మద్ సాలిహ్ .. ప్రస్తుత అధ్యక్షుడు మొయిజుకు తేల్చిచెప్పేశారు. అప్పుల పునర్ వ్యవస్ధీకరణ కోసం మొయిజు భారత్ తో చర్చలు జరపాలని భావిస్తున్నట్లు తాను మీడియాలో చూశానని, కానీ అప్పుల కోణంలోనే కాకుండా పొరుగు దేశమైన భారత్ తో సంబంధాల కోసం గట్టిగా ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు.

వాస్తవానికి చైనాతో ఉన్న18 బిలియన్ల అప్పులతో పోలిస్తే భారత్ కు ఇవ్వాల్సిన 8 బిలియన్ల అప్పులు పెద్ద సమస్య కాదని, కానీ సంబంధాలు అంతకంటే ముఖ్యమని విపక్ష నేత సాలిహ్ అధ్యక్షుడు మొయిజుకు హితవు పలికారు. తమకు భారత్ సాయం చేస్తుందని నమ్మకం ఉందని, కానీ అదే సమయంలో మొండి పట్టుదల వీడి భారత్ తో చర్చలకు ప్రత్నించాలని ఆయన సూచించారు. తమకు చాలా మంది సాయం చేసే వారు ఉన్నారని, కానీ అధ్యక్షుడు మొయిజు ఓ మెట్టు దిగాలన్నారు.












Click it and Unblock the Notifications