• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేడెక్కిన అమెరికా- మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం..!!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్.. అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తృటిలో ఓటమిపాలైన రిపబ్లికన్ పార్టీ నాయకుడు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి చివరి వరకు ప్రయత్నాలు సాగించినప్పటికీ.. సఫలం కాలేకపోయారు. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో పరాజయాన్ని చవి చూశారు. ఆ తరువాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ఫలితాలపై ఆయన కోర్టుకెక్కారు గానీ అక్కడా అపజయమే పలకరించింది.

క్యాపిటల్ హిల్‌ ముట్టడి..

క్యాపిటల్ హిల్‌ ముట్టడి..

ఆ మరుసటి ఏడాది జనవరిలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు రాజధాని వాషింగ్టన్ డీసీని ముట్టడించడం ఓ పెను సంచలనం. లక్షలాది మంది డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు, సానుభూతిపరులు క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడి చేశారు. పెద్ద ఎత్తున హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. భద్రత సిబ్బంది, ట్రంప్ మద్దతుదారుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీని తరువాత డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌ను ఖాళీ చేశారు. ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. అక్కడి మార్-ఎ-లాగో రెసిడెన్స్‌లో ఉంటోన్నారు.

మళ్లీ ఎన్నికల్లో పోటీ..

మళ్లీ ఎన్నికల్లో పోటీ..

ఇప్పుడు తాజాగా ఆయన మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన కార్యకలాపాలన్నీ పూర్తి చేస్తోన్నానని పేర్కొన్నారు. తన టీమ్.. ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద పేపర్ వర్క్‌ను చేపట్టిందనీ వివరించారు.

మద్దతుదారులతో

మద్దతుదారులతో


ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రెసిడెన్స్‌ నుంచి మాట్లాడారాయన. తన మద్దతుదారులతో సమావేశం అయ్యారు. వందలాది మంది మద్దతుదారులు, సానుభూతిపరుల సమక్షంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. జో బైడెన్ పాలనలో అమెరికా అనేక రంగాల్లో వెనుకపడిందని, అగ్రరాజ్యం హోదాను కోల్పోయే దశకు చేరుకుందని విమర్శించారు.

ఎన్నికల కమిషన్‌లో డాక్యుమెంట్స్..

ఎన్నికల కమిషన్‌లో డాక్యుమెంట్స్..


అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించడానికి సరిగ్గా 20 నిమిషాల ముందే ఆయన ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించారు. వాటిని కమిషన్ కార్యాలయం ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ క్షణం నుంచే అమెరికా మళ్లీ తన పూర్వవైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టిందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇదే నినాదం..

ఇదే నినాదం..


మేక్ అమెరికా ఎగైన్ గ్రేట్ అండ్ గ్లోరియస్ అనే నినాదంతో ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారాయన. రిపబ్లికన్ అభ్యర్థిగానే ఆయన ఎన్నికల బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఆయన అభ్యర్థిత్వాన్ని రిపబ్లికన్లు త్వరలోనే ఖరారు చేస్తారనే ప్రచారం ఊపందుకుంటోంది. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లకు గట్టిపోటీ ఇచ్చారు రిపబ్లికన్లు. తమ సత్తా తగ్గలేదని నిరూపించారు.

English summary
Former US President Donald Trump announces his bid for the 2024 presidency post. He said that to make America great and glorious again he will contest in the elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X