Donald Trump : ట్రంప్ కు బిగుస్తున్న ఉచ్చు ? 37 అభియోగాలు- ఒక్కటి తేలినా 20 ఏళ్ల జైలు..

రహస్య పత్రాల కేసులో చిక్కుకుని విలవిల్లాడుతున్న అమెరికా మాజీ ఆధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ బైడెన్ సర్కార్ మరింత లోతుగా ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఆయనపై రహస్య పత్రాల కేసులో అభియోగాలు నమోదు చేసిన ప్రభుత్వం.. వాటిని కోర్టుల్లో నిరూపించి శిక్ష వేయించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీపడకుండా అడ్డుకోబోతోంది. రహస్య పత్రాల కేసులో తాజాగా ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో ట్రంప్ పై మొత్తం 37 అభియోగాలతో ఛార్జిషీట్ వేశారు.

అమెరికాకు సంబంధించిన అత్యంత రహస్యమైన అణుపత్రాలు, రక్షణ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ట్రంప్ తాను పదవి నుంచి తప్పుకున్నాక కూడా తన వద్ద ఉంచుకున్నారని ఫెడరల్ కోర్టులో ప్రాసిక్యూటర్లు ఆయనపై మోపిన అభియోగాల్లో పేర్కొన్నారు. జనవరి 2021లో వైట్‌హౌస్‌ను వదిలి వెళ్తున్న సమయంలో పెంటగాన్, సీఐఏ, జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీ, ఇతర ఇంటెలిజెన్స్ సంస్థల నుండి అత్యంత రహస్యమైన ఫైల్‌లను ట్రంప్ తన వెంట తీసుకెళ్లారని న్యాయ శాఖ తెలిపింది.

former US president Donald Trump facing 37 charges In Classified Documents Case

ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం ట్రంప్ ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో నివాసం, క్లబ్‌లో వారిని అక్రమంగా ఉంచారని తేలింది. అలాగే కనీసం రెండు సందర్భాల్లో, ట్రంప్ తన బెడ్‌మిన్‌స్టర్, న్యూజెర్సీ గోల్ఫ్ క్లబ్‌లో వాటిని చూడటానికి అనుమతి లేని వ్యక్తులకు యూఎస్ సైనిక కార్యకలాపాలు, ప్రణాళికలపై రహస్య పత్రాలను చూపించినట్లు కూడా తేలింది. ట్రంప్ తీసుకున్న పత్రాలు యునైటెడ్ స్టేట్స్, విదేశీ దేశాల రక్షణ, ఆయుధాల సామర్థ్యాలకు సంబంధించిన సమాచారంగా నిర్ధారించారు.

అమెరికా అణు కార్యక్రమాలు, సైనిక దాడికి యునైటెడ్ స్టేట్స్, దాని మిత్రదేశాల ప్రణాళికలకు సంబంధించిన సమాచారం కూడా ఆయన తీసుకెళ్లిన వాటిలో ఉన్నాయని అధికారులు అభియోగాలు మోపారు. ఈ రహస్య పత్రాలను అనధికారికంగా బహిర్గతం చేయడం అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేస్తుందని ఆరోపించారు. దేశ రక్షణ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా తన వద్ద ఉంచుకోవడం, న్యాయాన్ని అడ్డుకునేందుకు కుట్ర పన్నడం, పత్రాలను అవినీతికరంగా దాచిపెట్టడం, తప్పుడు ప్రకటనలు వంటి 37 అభియోగాలతో ట్రంప్‌పై ఛార్జిషీట్ మోపారు. ఈ అభియోగాల ప్రకారం ఒక్కొక్కరికి 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+