వ్యాక్సిన్ తీసుకుంటే బీర్ ఫ్రీ , డోనట్స్, పొదుపు బాండ్లు కూడా.. బంపర్ ఆఫర్ ఎక్కడో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సైతం కొనసాగుతోంది .ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో,చాలా మంది యువత వ్యాక్సిన్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.అయితే యువతను వ్యాక్సినేషన్ కార్యక్రమం వైపు మళ్ళించడం కోసం ఓ సూపర్ ఆలోచన చేసింది యూఎస్ ప్రభుత్వం.
Recommended Video

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న యువతకు ఫ్రీగా బీరు,డోనట్ ఇవ్వడానికి ప్రణాళికలు
బైడెన్ సర్కార్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న యువతకు ఫ్రీగా బీరు,డోనట్ ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించింది. జూలై 4వ తేదీ నాటికి 70 శాతం మంది యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్ణయించిన బైడెన్ ప్రభుత్వం ఉచిత బీర్, ఉచిత డోనట్స్, పొదుపు బాండ్లు వంటి అనేక అద్భుతమైన బంపర్ ఆఫర్ లను ఇస్తూ కోవిడ్ -19 కు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి అమెరికన్లను ప్రోత్సహింస్తోంది. దీనికోసం ప్రభుత్వ అధికారులు మరియు పలు వ్యాపార సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.

జూలై 4న స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 70 శాతం మంది యువతకు వ్యాక్సినేషన్ లక్ష్యం
జూలై 4న స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 70 శాతం మంది యువత కనీసం ఒక షాట్ అయినా పొందాలని అధ్యక్షుడు జో బైడెన్ భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడం,విస్తరించడం కరోనా మహమ్మారిని అధిగమించడం కోసం, లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలకమని వారు భావిస్తున్నారు. యూఎస్ లో ఉన్న పెద్దవారికి ఇప్పటికే 56 శాతం, 145 మిలియన్లకు పైగా ప్రజలు , కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క కనీసం ఒక మోతాదును పొందారు.

100 డాలర్ల పొదుపు బాండ్లను అందిస్తున్న వెస్ట్ వర్జీనియా
ఇదిలా ఉంటే వెస్ట్ వర్జీనియాలో, టీకాలు తీసుకునే 16 నుండి 35 సంవత్సరాల వయస్సు గల నివాసితులకు రాష్ట్రం $ 100 పొదుపు బాండ్లను అందిస్తుందని గవర్నర్ జిమ్ జస్టిస్ ప్రకటించారు.
ఫెడరల్, రాష్ట్ర మరియు స్థానిక అధికారులు , ఫార్మసీలు, రెస్టారెంట్లు, బ్రూవరీస్, సూపర్ మార్కెట్లు మరియు క్రీడా బృందాలతో భాగస్వామ్యం పెట్టుకొని కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రోత్సాహకాలను అందిస్తూ, ప్రజలకు బంపర్ ఆఫర్ లు ఇస్తూ ముందుకు వెళుతున్నారు.

న్యూజెర్సీలో షాట్ అండ్ ఎ బీర్ ప్రోగ్రామ్
న్యూజెర్సీలో, గవర్నర్ ఫిల్ మర్ఫీ టీకాలను ప్రోత్సహించడానికి "షాట్ అండ్ ఎ బీర్" కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 కోట్ల మందికి కనీసం ఒక్క డోసు, 16 కోట్ల మందికి కనీసం రెండు డోసులు ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్లు తీసుకున్న యువతకు బీర్ ఆఫర్ చేస్తూ వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు.












Click it and Unblock the Notifications