జెన్ జెడ్ యుద్ధ భేరీ.. ఇప్పటికే 8 దేశాలు ఖతం.. నెక్స్ట్ ఆ దేశంలోనే..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జెన్ జెడ్ ట్రెండ్ మార్మోగుతోంది. 1995 నుంచి 2012 మధ్య జన్మించిన పిల్లలనే జనరేషన్ జెడ్ అని పిలుస్తుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన డిజిటల్ విప్లవం, అధునాతన స్మార్ట్ ఫోన్ లు, ఇంటర్నెట్, ఏఐ యుగంలో వీళ్లు జన్మించారు. ఈ తరంలో జన్మించినవారు అంతకుముందు తరాలవారి వ్యవహరశైలికి భిన్నంగా ఉంటున్నారు. తమపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించడాన్ని జెన్ జెడ్ అసలు అంగీకరించడం లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల నేపాల్ లో జరిగిన ఆందోళనలే. జెన్ జెడ్ ఆందోళనల ధాటికి అక్కడి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. నేపాల్ ప్రధాని రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇటీవల మనదేశంలోని లడఖ్ రాజధాని లేహ్ లోనూ యువత రెచ్చిపోయింది. లడఖ్ కు రాష్ట్ర హోదా కల్పించాలని, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వాలని నిరసనకారులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పలు మార్లు చర్చలు, నిరసనలు జరిగాయి. కానీ ఇటీవల జరిగిన నిరసనలలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
జెన్ జెడ్ ఆందోళనలు బంగ్లాదేశ్ లోనూ చెలరేగాయి. అక్కడ కూడా ప్రభుత్వం కుప్పకూలింది. తాజాగా యువత చేతిలో నేపాల్ బలైంది. ఇప్పుడు పెరూ దేశం కూడా జెన్ జెడ్ ఆందోళనల ధాటికి అట్టుడుకిపోతుంది. ఈ సంవత్సరంలో మొత్తం 8 దేశాల్లో జెన్ జెడ్ ఆందోళనలు చేపట్టింది. ఇండోనేషియాలో మొదలుపెట్టి ఇప్పుడు పెరూ వరకు వచ్చింది. సెప్టెంబర్ 27 న పెరూ రాజధాని లిమాలో వేలాదిమంది యువత రోడ్లపైకి వచ్చి ఆ దేశ అధ్యక్షుడు దినా బోలువార్టే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకున్నాయి. పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. లాఠీఛార్జీ చేశారు. అయితే పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. పెన్షన్ సిస్టమ్ లో పలు మార్పులు చేసినందుకు ఈ ఆందోళనలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మొదట్లో ఇండోనేషియాలో ఆ తర్వాత నెథర్లాండ్స్ లో జెన్ జెడ్ ఆందోళనలు చేపట్టింది.












Click it and Unblock the Notifications