భారతీయుల కోసం జర్మనీ బంపర్ ఆఫర్..!
జర్మనీ దేశం భారత విద్యార్థులు, నిపుణులకు అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆ దేశం ఏఐ, రోబోటిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో తీవ్ర నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. దీనిని అధిగమించేందుకు భారతీయ టాలెంట్‌ను ఆహ్వానిస్తుంది. అందులో భాగంగానే వలస విధానాలు, వీసా నిబంధనలను సరళీకరించింది. ఇంజినీరింగ్, ఐటీ, హెల్త్‌కేర్ ఖాళీలు భర్తీ చేసేందుకు ఈ చర్యలను చేపట్టింది.
ఈ మేరకు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల్లో భాగంగా వీసాల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. అందుకు గాను వీసాల జారీ వేగవంతం చేసేలా.. ఈయూ బ్లూ కార్డ్ అర్హత తగ్గించి 'ఆపర్చునిటీ కార్డ్'ను జర్మనీ ప్రవేశపెట్టింది. ఈ వ్యూహంలో టీయూ9 యూనివర్సిటీలు కీలకం కానున్నాయి. ఏఐ, రోబోటిక్స్, ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్, పునరుత్పాదక ఇంధనం వంటి భవిష్యత్ రంగాల ప్రత్యేక కోర్సులతో విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తుంది.

ఈ పరిణామంపై బోర్డర్‌ప్లస్ సీఈఓ మయాంక్ కుమార్ ఓపెన అయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జర్మనీ పారిశ్రామిక లక్ష్యాలు, జనాభా సంక్షోభం కలిసి భారత యువతకు గొప్ప అవకాశాన్ని సృష్టించాయి" అని అన్నారు. 2025లో ఉన్నత విద్యను కోరుకుంటున్న భారతీయ విద్యార్థులకు జర్మనీలోని స్టెమ్ కోర్సులు అత్యంత ప్రయోజనకరమని నిపుణులు సూచిస్తున్నారు.
అలానే టెర్న్ గ్రూప్ ఫౌండర్ అవినావ్ నిగమ్ స్పందిస్తూ.. ప్రస్తుతం దాదాపు 6 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో లక్షలాది మంది రిటైర్ కానున్నారని.. ఇది తాత్కాలిక కొరత కాదని దీర్ఘకాలిక అవసరమని స్పష్టం చేశారు. మెకానికల్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వంటి కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉందని వివరించారు.












Click it and Unblock the Notifications