జర్మనీ: జెహోవా విట్‌నెస్ హాల్‌లో కాల్పులు... సుమారు ఆరుగురు మృతి

ఉత్తర జర్మనీ నగరం హ్యామ్‌బర్గ్‌లో జెహోవా విట్‌నెస్ మీటింగ్ హాల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో సుమారు ఆరుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
కాల్పులు జరిపిన వ్యక్తి కూడా చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.
చనిపోయిన ఆరు లేదా ఏడుగురిలో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి కూడా ఉన్నాడా లేడా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని జర్మన్ మీడియా తెలిపింది.
అయితే, కాల్పులకు వెనుకాల ఉన్న ఉద్దేశ్యం ఏమిటన్నది కూడా ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు.
నగరంలోని గ్రాస్ బోర్‌స్టల్ జిల్లాలో దీల్‌బోగ్ స్ట్రీట్‌లో ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మరికొంత మంది ప్రజలు కూడా గాయాలు పాలయ్యారు.
సంఘటన స్థలంలో గుర్తించిన ఒక మృతదేహాన్ని కాల్పులు జరిపిన వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతామని అన్నారు.
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9.15 ప్రాంతంలో తమకు కాల్పులు జరుగుతున్నట్లు రిపోర్టులు వచ్చాయని పోలీసు అధికార ప్రతినిధి హోల్గర్ వెహ్రెన్ చెప్పారు.
ఆఫీసర్లు అక్కడికి వెళ్లే సరికి కొందరు బుల్లెట్ల వల్ల తీవ్రంగా గాయపడ్డారని, కొందరు మరణించినట్లు గుర్తించారని చెప్పారు.
భవనం పై అంతస్తు నుంచి ఈ కాల్పులు జరుగుతున్నట్లు గుర్తించడంతో, భవంతి పైకి వెళ్లారని, అక్కడ కూడా ఒక వ్యక్తిని గుర్తించినట్లు చెప్పారు. నేరస్తులు సంఘటన స్థలం నుంచి పారిపోయిన సంకేతాలు ఏమీ లేవని అన్నారు.
బాధితులను పోలీసులు ఇంకా గుర్తించలేదని హోల్గర్ వెహ్రెన్ చెప్పారు. సంఘటన స్థలం వద్ద ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు పలువురు వ్యక్తులు చనిపోయినట్లు తెలిసిందని, చాలా మంది గాయాలు పాలయ్యారు. గాయాలు పాలైన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ కాల్పుల వెనుకాల ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications