"పాక్ ప్రధాని షరీఫ్ ఆమెకు లైన్ వేశారట"
ఇస్లామాబాద్ : ఓ ప్రయాణం సందర్బంగా విమానంలో తనను కలిసిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తనను ఆకర్షించడానికి ప్రయత్నించాడని, ఆ క్రమంలో ఆయన తనకు లైన్ వేశాడని అంటోంది పాక్ కు చెందిన అస్మా అనే యువతి. పాకిస్తాన్ కు చెందిన స్థానిక 'హెచ్ టీవీ రియాల్టీ లైవ్ షో' లో భాగంగా పాల్గొన్న అస్మా రాజ్ పుత్, ఈ విషయాలను వెల్లడించింది.
ఆ సమయంలో తాను బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేశానని, దీంతో తనవైపే చూడడం మొదలుపెట్టిన ప్రధాని షరీఫ్ నవ్వుతూ తనను పలకరించారని చెప్పింది. అనంతరం తన గురించి ఆరా తీసిన ఆయన, ఏం చేస్తున్నావంటూ అడిగారని, కరాచీ నుంచి ఇస్లామాబాద్ వెళుతున్నాని చెప్పడంతో.. తాను ఇస్లామాబాద్ లోనే ఉంటానని నవ్వుతూ బదులిచ్చారట షరీఫ్.

ఆ తర్వాత జరిగిన కబుర్లలో.. సాయంత్రం ప్రోగ్రామ్ ఏంటన్న ప్రస్తావన తీసుకొచ్చారని, ఇంకా ఏం ప్లాన్ చేయలేదని బదులివ్వడంతో, తన ఇంటికి డిన్నర్ కు రావాల్సిందిగా కోరారని చెప్పుకొచ్చింది అస్మా. అయితే ప్రధాని షరీఫ్ ఆఫర్ చేసిన డిన్నర్ కు తాను హాజరు కాలేదని.. తాను చెబుతున్న విషయాలకు సంబంధించి అన్ని ఆధారాలు తనవద్ద ఉన్నాయని తెలిపింది.
నవాజ్ షరీఫ్ కంటే ముషారఫ్ అంటేనే ఇష్టం..
ప్రస్తుత ప్రధాని నవాజ్ షరీఫ్ మాత్రమే కాదు, మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ కు కూడా తనకు లైన్ వేసిన వ్యక్తే అని చెప్పింది అస్మా. అంతేకాదు.. పర్వేజ్ గెటప్ తనను ఆకట్టుకుందని, ఆయన డ్రెస్సింగ్, స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటాయని, ముషారఫ్ రొమాంటిక్ లుక్ తనకు నచ్చిందని అస్మా వ్యాఖ్యానించింది. అయితే నవాజ్ షరీఫ్, పర్వేజ్ ముషారఫ్.. ఈ ఇద్దరిలో తనకు ముషారఫ్ లైన్ వేయడమే బాగా నచ్చిందని, షరీఫ్ నచ్చలేదని తేల్చేసింది అస్మా.












Click it and Unblock the Notifications