భారత గ్యాంగ్‌స్టర్ ఆచూకీ ఇస్తే 10 లక్షల డాలర్ల రివార్డ్ ప్రకటించిన అమెరికా: మోస్ట్ వాంటెడ్ లిస్ట్

భారత్‌లో అనేక నేరాలతో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్.. సతీందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌. అతన్ని పట్టుకోవడానికి ఏకంగా అమెరికానే రంగంలోకి దిగింది. ఈ విషయంలో అమెరికా దర్యాప్తు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. టాప్ 10 మోస్ట్ వాంటెడ్ నేరస్తుల జాబితాలో అతని పేరును చేర్చింది. అతని గురించి సమాచారం అందించిన వారికి ఏకంగా 10 లక్షల భారీ రివార్డును సైతం ప్రకటించింది. మన కరెన్సీతో పోల్చుకుంటే.. దాదాపు 8.3 కోట్ల రూపాయలు.

భారత్ సహా కెనడా, అమెరికాల్లో సంచలనం సృష్టించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నార్త్ అమెరికా విభాగానికి గోల్డీ బ్రార్.. కీ లీడర్‌గా వ్యవహరిస్తోన్నట్లు కాలిఫోర్నియా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా కాలిఫోర్నియాతో పాటు అమెరికాలోని ఇతర ప్రాంతాలలో అనేక దాడులకు పాల్పడినట్లు ఎఫ్‌బీఐ తన నివేదికలో వెల్లడించింది. హత్యలు చేయడం, కాల్పులు జరపడం, కిడ్నాప్‌లకు ఒడిగట్టడం, పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడడం వంటి చట్టవ్యతిరేక పనులను ఈ ముఠా చేస్తోందని పేర్కొంది.

Goldy Brar Manhunt Intensifies as FBI Offers 1M dollar Bounty Set for Information Leading to Arrest

హత్యలు, ఆయుధాల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల విక్రయాలు వంటి తీవ్ర నేరాల నేపథ్యంలో గోల్డీ బ్రార్‌పై లాస్ ఏంజెల్స్‌ కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు అనేక రికో చట్టాల కింద అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌బీఐనే రంగంలోకి దిగింది. అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు కూడా అతనికి సంబంధించిన సమాచారాన్ని చేరవేసింది.

తిరుమలలో అనూహ్య రద్దీ- టీటీడీ కీలక నిర్ణయం
తిరుమలలో అనూహ్య రద్దీ- టీటీడీ కీలక నిర్ణయం

పంజాబ్ లో జన్మించిన గోల్డీ బ్రార్‌కు సతీందర్‌జీత్ సింగ్ బ్రార్, సతీందర్ జీత్ వంటి పలు మారుపేర్లు ఉన్నాయి. పంజాబీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలడు. వివిధ దేశాలలో వేర్వేరు నకిలీ గుర్తింపులతో చలామణి అవుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నట్లు ఎఫ్‌బీఐ గుర్తించింది. ప్రస్తుతం అమెరికా సరిహద్దు ప్రాంతాలను తన స్థావరంగా మలచుకున్నాడని, ఇక్కడి నుంచే మెక్సికో, కెనడా, భారత్ లో తన అనుచరులతో చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతోన్నట్లు అనుమానిస్తోంది.

వాస్తు ప్రకారం.. ఇంటి పూజా గదిలో ఉంచకూడని వస్తువులు
వాస్తు ప్రకారం.. ఇంటి పూజా గదిలో ఉంచకూడని వస్తువులు

కాలిఫోర్నియా శాక్రమెంటో, ఫ్రెస్నో సిటీల్లో అతనికి సంబంధించిన బలమైన సమాచార నెట్‌వర్క్ ఉన్నట్లు ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతన్ని అత్యంత ప్రమాదకరమైన నేరస్తుడిగా గుర్తిస్తూ తాజాగా ఓ పబ్లిక్ అడ్వైజరీ విడుదల చేసింది. గోల్డీ బ్రార్ ను ఏ క్షణంలోనైనా పట్టుకోవడానికి సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత, నిఘాను పెంచారు. అతని ప్రతి కదలికపైనా డేగకన్ను వేసినట్లు పేర్కొన్నారు.

ఎఫ్‌బీఐ అధికారికంగా తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో గోల్డీ బ్రార్‌పై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి మరింత పెరిగింది. అంతర్జాతీయ నేర సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రపంచవ్యాప్త దర్యాప్తు సంస్థలన్నీ ఏకతాటిపైకి రానున్నాయి. గోల్డీ బ్రార్‌పై అమెరికా ప్రకటించిన ఈ మోస్ట్ వాంటెడ్ హోదా, భారీ రివార్డుతో అతని కదలికలకు త్వరలోనే అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+