ప్లీజ్, థ్యాంక్స్: గూగుల్ సెర్చ్‌లోను బామ్మ మర్యాద
లండన్: సాధారణంగా మనం ఎవరినైనా ఏమైనా అడగాలనుకుంటే మర్యాదగా అడుగుతాం. ఏదైనా అనుమానం వచ్చినా లేదా ఎక్కడికైనా కొత్త ప్రాంతానికి వెళ్తే దారి గురించి అడగాలన్నా.. పక్కనున్న వారిని మర్యాద ఇచ్చి మరీ అడుగుతాం.
అదే సెర్చింజన్ గూగుల్‌లో అయితే ఆ పదం కొడతాం అంతే! కానీ ఓ బామ్మ మాత్రం గూగుల్ సెర్చింజన్‌లో కూడా మర్యాద చూపించింది. అలవాటులో భాగంగానో, మరేమిటో కానీ తనకు వచ్చిన అనుమానాన్ని గూగుల్‌లో కొట్టింది. అయితే, ఆ పదానికి ముందు, వెనుక మర్యాద చూపించింది.

బ్రిటన్‌కు చెందిన బెన్ జాన్ అనే యువకుడు ఓ రోజు తన బామ్మ ల్యాప్‌టాప్ వాడుతున్నాడు. ఆ సమయంలో గూగుల్‌లోకి వెతకుతుండగా.. తన బామ్మ వెతికిన సందేహం కనిపించింది.

ఓ రోమన్ సంఖ్య విలువ తెలుసుకునేందుకు ఆమె గూగుల్ సెర్చ్ చేశారు. అయితే, సెర్చ్ బార్‌లో తన ప్రశ్నకు ముందు మర్యాదగా.. ప్లీజ్ అని, ప్రశ్న తర్వాత థ్యాంక్యూ అనే పదం జత చేశారు.
దీనిని చూసిన బెన్ జాన్ దానిని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది వైరల్ అయింది. ఈ ట్వీట్‌ను వేలాది మంది లైక్ చేశారు. మరెందరో రీట్వీట్ చేసారు. ఈ విషయం గూగుల్ వరకు వెళ్లగా స్పందించింది. ఆమె సందేహాన్ని తీర్చడంతో పాటు, మీ సందేహం మా ముఖాల మీద చిరునవ్వులు పూయించిందని గూగుల్ ట్వీట్ చేసింది.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం











Click it and Unblock the Notifications