టెక్సాస్ కాల్పులు: మహిళ మృతి, పలువురికి గాయాలు

Subscribe to Oneindia Telugu

టెక్సాస్: అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఒకటైన టెక్సాస్ రాష్ట్రంలోని అస్టిన్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

అస్టని్ నగరంలోని డౌన్ టౌన్ లోకి తుపాకితో ప్రవేశించిన దుండగుడు రెండు చోట్ల కాల్పులకు తెగబడ్డాడని అస్టిన్ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు తెలిసిన సమాచారాన్నిబట్టి కాల్పుల్లో ఓ 30 ఏళ్ల మహిళ మృతి చెందింది.

మరి కొంత మందికి గాయాలయ్యాయి. డౌన్ టౌన్ లోని ఈస్ట్ స్ట్రీట్, 208 వద్ద బుల్లెట్ దెబ్బలు తిన్న క్షతగాత్రులను గుర్తించామని, వారిని బ్రాకెన్ రిడ్జ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కు తరలించామని పోలీసులు చెప్పారు.

కాగా, ఘటనా స్థలం టెక్సాస్ నైట్ క్లబ్‌కి సమీపంలోనే ఉండటం గమనార్హం.
అయితే సాయుధుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. దీంతో పౌరులు ఇళ్లల్లోనే ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman in her 30s was pronounced dead at the scene and three people have been transported to hospital, according to police.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి