ఈ రోజే ట్రంప్ షాక్: భారత ఐటీ రంగంలో కుదుపు!

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాడు కీలకమైన అంశం విషయమై సంతకం చేయనున్నారు. విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులపై ట్రంప్ సంతకం చేయనున్నారు.

ఉత్తర కొరియాకు షాక్: ఆకస్మిక దాడులకైనా వెనుకాడొద్దు.. ట్రంప్

దీని ప్రకారం అత్యున్నత నైపుణ్యం ఉన్న వారు మాత్రమే ఇతర దేశాల నుంచి అమెరికాలో అడుగు పెట్టవలసి ఉంటుంది. దీంతో భారత ఐటీ రంంగం కుదుపులకు లోను కానుందని చెబుతున్నారు. ఉద్యోగాల విషయంలోనే కాదు.. 'అమెరికా వస్తువులే కొనాలి, అమెరికా వారినే ఉద్యోగులుగా చేర్చుకోవాలని' కూడా ట్రంప్ చెప్పనున్నారు.

ట్రంప్ సంతకం

ట్రంప్ సంతకం

ఇక, విస్కన్సిన్‌లోని స్నాప్‌ ఆన్‌.ఐఎన్‌సీ ప్రధాన కార్యాలయానికి ట్రంప్ రానున్న సందర్భంగా హెచ్‌1బీ వీసా అంశానికి సంబంధించిన ఆదేశాలపై సంతకం చేయనున్నారు. దీంతో ఉద్యోగాల కోసం అమెరికాలోకి రాకపోకలు సాగించే వారిపై గట్టి నిఘా ఉంటుందని, అత్యధిక వేతనం, అత్యధిక ఉపాధి కల్పించాలన్న తన లక్ష్యం నెరవేరుతుందని ట్రంప్‌ కార్యవర్గం భావిస్తోంది.

ఉద్యోగాలు తన్నుకుపోతే కఠినంగా..

ఉద్యోగాలు తన్నుకుపోతే కఠినంగా..

ట్రంప్‌ పదవీబాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఫస్ట్‌ అమెరికా నినాదాన్ని అమలు చేసినట్టవుతుందని భావిస్తున్నారు. దీంతోపాటు ఫెడరల్‌ కాంట్రాక్ట్‌లు కూడా అమెరికా సంస్థలకే వచ్చేలా చేస్తున్నారు. ఇది దేశ ఆర్థిక వ్వవస్థకు కూడా ఊతం ఇస్తుందని అంటున్నారు.

ఈ మార్పులకు తోడు కార్మిక, న్యాయ.. హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగాలను కూడా అప్రమత్తం చేశారు. అమెరికావాసుల ఉద్యోగాలను తన్నుకుపోయే విదేశీయులపై కఠినంగా వ్యవహరించాలనే ఆదేశాలు ఉన్నాయి.

అత్యుత్తమ నైపుణ్యం

అత్యుత్తమ నైపుణ్యం

అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారికే హెచ్‌1బీ వీసాలు ఇవ్వాలనే ఫెడరల్‌ శాఖలు ఈ నిబంధనలను సూచించాయి. వీటిని ప్రత్యేక విధులకే మాత్రమే కేటాయిస్తారు. వీటిల్లో కూడా యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల ప్రకారం ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉండాలి.

శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, కంప్యూటర్‌ ప్రోగ్రామర్లకు మాత్రం ఎలాంటి పరిమితి లేదు. 65 వేల వీసాలు జారీ చేయడానికి ప్రభుత్వం లాటరీ విధానాన్ని ఎన్నుకుంది. మరో 20వేల వీసాలను గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్‌ వర్కర్లకు కేటాయిస్తారు.

తగ్గిపోయిన వీసాలు

తగ్గిపోయిన వీసాలు

ఈ ఏడాది హెచ్‌1బీ వీసాలకు దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గత ఏడాది 2,36,000 ఉండగా ఈ సారి 1,99,000లకు పడిపోయాయి. అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్న వారిని నియమించుకోవడానికే హెచ్‌1బీ వీసాలను వినియోగిస్తామని కంపెనీలు చెబుతున్నాయి. ఫేస్‌బుక్‌ వంటి కంపెనీల్లో 15 శాతం మంది ఉద్యోగులు ఈ తాత్కాలిక వీసాలనే వినియోగించుకుంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
US President Donald Trump on Tuesday will sign an executive order directing federal agencies to recommend changes to a temporary visa program used to bring foreign workers to the United States to fill high-skilled jobs.
Please Wait while comments are loading...