Israel Hamas Deal: గాజా వాసులకు హమాస్ ఛీఫ్ గుడ్ న్యూస్...
ఇజ్రాయెల్ పై సెప్టెంబర్లో హమాస్ మెరుపుదాడుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని వల్ల గాజాలో చిన్నారులో పాటు ఆస్పత్రుల్లో రోగులు సైతం భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా యుద్ధ విరమణ కోసం ఇరుదేశాలపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా యుద్ధం ఆపాలంటూ ఇజ్రాయెల్ పై మిత్రపక్షాలే ఒత్తిడి చేస్తున్న పరిస్దితి. దీంతో ఇజ్రాయెల్ హమాస్ తో తెరవెనుక చర్చల్ని ముమ్మరం చేసింది.
తాజాగా హమాస్ తో డీల్ పై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. ఇంకా డీల్ కుదరలేదని చెప్పారు. కానీ తాజా అప్ డేట్ ప్రకారం హమాస్ తో డీల్ ను ఫైనల్ చేసుకునే దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందానికి దగ్గరవుతున్నట్లు హమాస్ ఛీఫ్ ఇస్మాయిల్ హనియే ప్రకటన చేశారు. దీంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య చారిత్రక ఒప్పందం కోసం అంతర్జాతీయంగా చేస్తున్న ప్రయత్నాలు వాస్తవరూపం దాలుస్తున్నట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్-హమాస్ డీల్ పై హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే టెలిగ్రామ్ లో అప్ డేట్ ఇచ్చారు. ఇందులో ఇజ్రాయెల్ తో రాజీ ఒప్పందం దగ్గర్లోనే ఉందని ప్రకటించారు. దీంతో గాజాలో ప్రతీరోజూ నరకంగా బతుకుతున్న లక్షలాది మంది పాలస్తీనియులకు ఇది ఎంతో ఊరటగా మారింది. ఇకనైనా యుద్ధం ఆగితే కనీసం బతికి ఉంటామన్న ఆశతో ఉన్న గాజా వాసులకు హమాస్ ఛీఫ్ గుడ్ న్యూస్ చెప్పినట్లయింది.
ఇప్పటికే హమాస్ పై ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతిదాడుల్లో వేల మంది సాధారణ పౌరులు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు చనిపోతున్నారు. దీంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ పై ఒత్తిడి అమాంతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తమను తాము సమర్ధించుకునేలా ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదుల వీడియోలు విడుదల చేస్తోంది. తాజాగా తమ బందీల్లో ఒక మహిళను హమాస్ తీవ్రవాది కాల్చి చంపుతున్న వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది.












Click it and Unblock the Notifications