రెండేళ్ల పగకు ప్రతీకారమే హమాస్ దాడులు ? అల్ అక్సా మసీదు టార్గెట్ చేసినందుకే !
ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య దశాబ్దాల క్రితం నాటిదే అయినా ఇప్పుడు ఉన్నట్లుండి ఇజ్రాయెల్ పై హమాస్ ఎందుకు దాడులు చేసింది, అదీ భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో ఏకకాలంలో వేల కొద్దీ రాకెట్లు వరుసగా ప్రయోగించడంతో పాటు ఆ దేశ పౌరుల్ని, విదేశీయుల్ని కూడా వదిలిపెట్టకుండా బందీలుగా పట్టుకుపోవడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంత హఠాత్తుగా పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్ధ ఇలా దాడులకు దిగడం వెనుక అసలు కారణం వెలుగులోకి వచ్చింది.
ఇజ్రాయెల్ భూభాగంలో ఉన్న ముస్లింల పవిత్ర స్ధలం అల్ అక్సా మసీదుపై 2021లో రంజాన్ మాసం సందర్భంగా అక్కడి ప్రభుత్వం జరిపిన తనిఖీలు, అక్కడి ముస్లింలను వేధింపులకు గురిచేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ పై దాడులకు మాస్టర్ బ్రెయిన్ భావిస్తున్న హమాస్ కీలక కమాండర్ మొహమ్మద్ డెయిఫ్ వెల్లడించాడు. ఓ ఆడియో సందేశంలో డెయిఫ్ ఈ విషయాన్ని వెల్లడించడంతో ఇజ్రాయెల్ అకృత్యాలపై చర్చ జరుగుతోంది.

గత వారం హమాస్ చేసిన విధ్వంసక దాడిని ఇజ్రాయెల్ తన 9/11 దాడులుగా అభివర్ణించింది. దాడి వెనుక రహస్య సూత్రధారి, పాలస్తీనా ఉగ్రవాది మహ్మద్ డెయిఫ్ దీనిని అల్ అక్సా ఫ్లడ్ గా అభివర్ణించాడు. శనివారం గాజా స్ట్రిప్ నుండి హమాస్ వేలాది రాకెట్లను ప్రయోగించినట్లు ఓ ఆడియో టేప్ బయటికి వచ్చింది. ఉందులో ఇజ్రాయెల్ యొక్క మోస్ట్ వాంటెడ్
వాడిన పదాలు జెరూసలేంలోని అల్ అక్సా మసీదులో ఇజ్రాయెల్ దాడులకు తిరిగి మూల్యం చెల్లిస్తున్నట్లు అర్ధమవుతోంది.
రంజాన్ సందర్భంగా ఇజ్రాయెల్ అల్ అక్సా మసీదుపై దాడి చేయడం, అక్కడికి ప్రార్ధనల కోసం వచ్చిన వారిని కొట్టడం, వారిపై దాడి చేయడం, వృద్ధులు, యువకులను మసీదు నుండి బయటకు లాగేయడం వంటి దృశ్యాలు వీడియో ఫుటేజీల్లో కనిపించాయి. ఇదంతా అరబ్, ముస్లిం దేశాల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. జెరూసలేంలో సార్వభౌమాధికారం, మతానికి సంబంధించిన విషయాలపై హింసకు దీర్ఘకాలంగా కారణంగా ఉన్న అల్ అక్సా మసీదు ప్రాంగణంలోని ఆ తుఫాను ఇజ్రాయెల్ , హమాస్ మధ్య అప్పట్లో 11 రోజుల పోరాటానికి కూడా దారితీసింది.
1973లో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత అల్ అక్సా మసీదులో చోటు చేసుకున్న ఈ ఘటనలే తాజాగా హమాస్ దాడులకు కారణమైనట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా హమాస్ కమాండర్ డెయిఫ్ కూడా తన ఆడియో రికార్డింగ్ లో వెల్లడించాడు.
ఈరోజు అల్ అక్సా యొక్క ఆవేశం, మన ప్రజల, దేశం యొక్క ఆవేశం విస్ఫోటనం చెందుతోందన్నాడు. మా ముజాహిదీన్లు ఈ నేరస్థుడికి (ఇజ్రాయెల్ )కు అతని కాలం ముగిసిందని తెలియజేసే సమయం అని పేర్కొన్నాడు. హమాస్-ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో ప్రస్తుతం డెయిఫ్ ఆచూకీ తెలియడం లేదు. అయితే అతను ఎన్‌క్లేవ్ కింద సొరంగాల్లో ఉండొచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications