ఉక్రెయిన్ వార్ లో హృదయవిదారక దృశ్యాలు- చిన్నారి వీపుపై కుటుంబ వివరాలు రాసిన తల్లి
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై నెలన్నర కావస్తోంది. అయినా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. మరోవైపు రష్యా దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఉక్రెయిన్ లో తల్లులు బెంబేలెత్తిపోతున్నారు.తమ పిల్లలు తప్పిపోకుండా కాపాడుకోవడం వారికి సమస్యగా మారింది. దీంతో వారి వీపులపై కుటుంబవివరాలు రాసి మరీ కాపాడుకుంటున్న హృదయవిదారక దృశ్యాలు చూపరుల్ని కలిచివేస్తున్నాయి.

యుద్ధం ఎంత చెడ్డదంటే..
ప్రపంచంలో ఏమూల యుద్ధం జరిగినా అది చెడ్డదనే వాదన ఎప్పుడూ వినిపిస్తుంటుంది. ఎందుకంటే ఓసారి యుద్ధం మొదలయ్యాక అది ఏ మలుపు తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. అలాగే యుద్ధంలో జయాపజయాల సంగతి పక్కనబెడితే అందులో చోటు చేసుకునే ఘటనలు ఎప్పుడూ హృదయవిదారకంగానే ఉంటాయి. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న పోరులోనూ అదే పరిస్ధితి కనిపిస్తోంది. దీంతో వీటిని దగ్గరి నుంచి చూస్తున్న వారితో పాటు అంతర్జాతీయంగా కూడా అందరి హృదయాల్నీ ఈ యుద్ధం కలచివేస్తోంది.

తల్లీ బిడ్డలూ దూరమవుతున్న వైనం
ఉక్రెయిన్ వార్ లో రష్యా చేస్తున్న దాడులతో బెంబేలెత్తిపోతున్న జనం ఎటు దారి కనిపిస్తే అటు పారిపోతున్నారు. ఇందులో పిల్లల్ని సైతం వదిలేసి తల్లితండ్రులు.. అలాగే తల్లితండ్రుల్ని వదిలేసి పిల్లలు పారిపోతున్న ఘటనలు కోకొల్లలు. దీంతో ఇప్పుడు తల్లీ బిడ్డల్ని సైతం దూరం చేస్తున్న ఈ యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు రష్యా ఈ యుద్ధానికి తెగించడంపై అంతా మండిపడుతున్నారు. అయినా ఓసారి యుద్ధం మొదలయ్యాక జరిగే నష్టాలు భరించక తప్పదు.
పిల్లల వీపుపై కుటుంబ వివరాలు రాస్తున్న తల్లులు
యుద్ధం కారణంగా ఎక్కడికక్కడ పారిపోతున్న జనం వారి పిల్లలు తప్పిపోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని యిద్ధంలో పిల్లల్ని కాపాడుకోవడం కూడా ఇప్పుడు ప్రాణాలపైకి తెస్తోంది. అందుకే ఇప్పుడు ఉక్రెయిన్ లో పలువురు తల్లులు తమ కుటుంబాల వివరాల్ని పిల్లల వీపుపై రాసేస్తున్నారు. తద్వారా వారు ఎక్కడైనా తప్పిపోతే సులువుగా గుర్తించేందుకు వారి కన్నవాళ్లకు ఇతరులు అప్పగించేందుకు వీలుగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఈ హృదయవిదారక దృశ్యాలు కలచివేస్తున్నాయి.

సోషల్ మీడియాలోనూ వైరల్
ఉక్రెయిన్ వార్ లో పిల్లలు తమ కుటుంబాలకు దూరం కాకుండా కాపాడుకునేందుకు వారి వీపులపై కుటుంబ సభ్యుల పేర్లను తల్లులు రాస్తున్న ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటొల్ని నెట్లో స్ధానికంగా ఉండే కొందరు పెట్టగా.. అవి కాస్తా ప్రపంచ దేశాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం తెచ్చిన కష్టాల్ని ప్రపంచం గుర్తించేందుకు ఇవి చక్కగా ఉపయోగపడుతున్నాయి. దీంతో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆపాలంటూ ఒత్తిడి కూడా పెరుగుతోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications