వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్‌లో పోలీస్ అధికారిగా తొలి హిందూ యువతి

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో తొలిసారి ఓ హిందూ యువతి పోలీస్ అధికారిగా ఉద్యోగంలో చేరారు. సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన పుష్ఫా కొల్హి అనే యువతి ఏఎస్సైగా ఎంపికైంది. కాగా, ఆ దేశంలో ఏఎస్సైగా నియమితులైన తొలి హిందూ యువతిగా ఆమె రికార్డు సృష్టించింది.

ఎమ్మెల్యే శ్రీదేవిపై కుల వివక్ష వ్యాఖ్యల ఎపిసోడ్ లో ట్విస్ట్ .. ఆమె ఎమ్మెల్యే సీటుకే ఎసరుఎమ్మెల్యే శ్రీదేవిపై కుల వివక్ష వ్యాఖ్యల ఎపిసోడ్ లో ట్విస్ట్ .. ఆమె ఎమ్మెల్యే సీటుకే ఎసరు

సింధ్ ప్రావిన్స్‌లో పుష్ఫా కొల్హికి పోస్టింగ్ ఇచ్చినట్లు జియో న్యూస్ తన కథనంలో వెల్లడించింది. ఈ విషయాన్ని మానవ హక్కుల కార్యకర్త కపిల్ దేవ్ ట్విట్టర్‌లో తెలియజేశారు. గత జనవరిలో హిందూ సామాజిక వర్గానికి చెందిన సుమన్ పవన్ బోదాని సివిల్ మెజిస్ట్రేట్‌గా నియమితుయ్యారు.

Hindu girl becomes first police officer in Paks Sindh province

కాగా, పాకిస్థాన్‌లో హిందువులు అతిపెద్ద మైనార్టీ కమ్యూనిటీగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం.. పాకిస్థాన్‌లో మొత్తం 75లక్షల మంది హిందువులు ఉన్నారు. అయితే, అనధికారికంగా ఈ సంఖ్య 90లక్షల వరకు ఉందని సమాచారం. కాగా, పాక్ ప్రభుత్వాల తీరుతో ఆ దేశంలోని మైనార్టీలకు రక్షణ లేకుండా పోతోంది.

భారత్‌పై తప్పుడు కూతలు కూసి అభాసుపాలు: పాక్ మాజీ రాయబారికి పోర్న్‌స్టార్ కృతజ్ఞతలు!భారత్‌పై తప్పుడు కూతలు కూసి అభాసుపాలు: పాక్ మాజీ రాయబారికి పోర్న్‌స్టార్ కృతజ్ఞతలు!

భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత ఆ దేశ జనాభాలో పావు శాతానికిపైగా ఉన్న హిందువుల సంఖ్య.. క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది. హిందువులను బలవంతంగా మతం మార్చడం, హత్యలు, హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్లి మతం మార్చి పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలతో హిందువుల సంఖ్య మరింతగా తగ్గిపోయింది. విభజన తర్వాత సుమారు 26శాతంగా ఉన్న హిందువుల సంఖ్య.. ఇప్పుడు ఆ దేశంలో 10శాతం కంటే తక్కువగానే ఉండటం గమనార్హం.

English summary
For the first time, a Hindu girl has been inducted into Sindh Police after passing the provincial competitive examinations, a media report said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X