వాషింగ్టన్‌లో హిందూ దేవాలయంపై దాడి: గోడలపై పిచ్చి రాతలు
వాషింగ్టన్: వాషింగ్టన్‌లో ఓ హిందూ దేవాలయం పైన కొందరు దుండగులు దాడి చేశారు! స్థానిక మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. దేవాలయం మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్దమైంది. ఈ నేపథ్యంలో దాని పైన కొందరు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.
అలాగే, ఆలయం గోడల పైన గెటవుట్ అని రాశారు. ఆలయం వెలుపల స్వస్తిక్ గుర్తుతో పాటు ఆ రాతలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి పరిశీలించారు. అనంతరం దీని పైన విచారణ మొదలు పెట్టారు.
ఈ ఘటన పైన హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనలు బాధాకరమన్నారు. గెటౌట్ అనేందుకు వారెవరని ప్రశ్నించారు. ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ స్పందించారు.

ఈ ఘటన పైన పోలీసులు వేగంగా స్పందించారని కితాబిచ్చారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పైన మతవ్యాఖ్యలు చేసిన పదిరోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది.












Click it and Unblock the Notifications