భర్త ఉండగానే.. బాయ్ ఫ్రెండ్‌తో గర్భం: తట్టుకోలేక దారుణంగా చంపేశాడు..

Subscribe to Oneindia Telugu

ఫ్లోరిడా: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే గాక, అతనితో గర్భం దాల్చిందని తెలిసి.. ఓ భర్త ఆమెను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఈ ఘటన ఫ్లోరిడాలోని హాలీవుడ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. హలీవుడ్‌కు చెందిన క్లాడే సేజూర్(48), మారియా కెమాల్ జోసేఫ్(40)భార్యభర్తలు. హాలీవుడ్‌లోని థామస్ స్ట్రీట్‌లో 5900 బ్లాకులో వారు నివసిస్తున్నారు. వీరికి నలుగురు పిల్లలు కాగా.. వయసు పరంగా 4నుంచి 17ఏళ్ల మధ్యలో ఉన్నారు.

Seijour

అయితే భార్య ఇటీవల వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని క్లాడే సెజూర్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు, సదరు వ్యక్తి ఏకంగా తనకు ఫోన్ చేసి మరీ.. జోసెఫ్ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని తానే అని పేర్కొన్నాడని, అందువల్లే భార్యను చంపేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ విషయాన్ని తాను జీర్ణించుకోలేకే.. ఈ చర్యకు ఒడిగట్టానని పేర్కొన్నాడు.

తనను మోసం చేసినందుకే.. ఈ శిక్ష విధించానని చెప్పాడు. పోలీసులు ఇంటికి వచ్చేసరికి జోసెఫ్ రక్తపు మడుగులో పడి ఉండగా.. సేజూర్ వారి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. హత్యానంతరం అతనే స్వయంగా పోలీసులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉండగా.. పిల్లల బాగోగులను అతని బంధువు ఒకరు చూసుకుంటున్నారు

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Hollywood man beat his wife to death with a pipe wrench while their four children were home after learning she was pregnant with another man's baby, police said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి