ఫ్రాన్స్‌లో మరోసారి కాల్పుల మోత: పోలీసులపై దాడి
పారిస్: ఫ్రాన్స్‌లో మరోసారి కాల్పు మోత సంచలనం సృష్టించింది. ఓ దుండగుడు పోలీసుపైకి కాల్పులు జరిపాడు. ప్రాన్స్‌లోని మార్సెల్లీలో ఈ కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. ఫ్రాన్స్ ప్రధాని మాన్యుయెల్ వాల్స్ మార్సెల్లీలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ కాల్పుల మోత చోటు చేసుకుంది. కాల్పులు జరిగిన నగరానికి మరిన్ని బలగాలను తరలించారు. వివరాలు అందాల్సి ఉంది.

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇటీవల ఉగ్రవాదులు పత్రికా కార్యాలయంపై దాడి చేసి 12 మందిని కాల్చి చంపిన సంఘటనను మరిచిపోక ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సమయంలో భద్రతా దళాల ఆపరేషన్‌లో ఉగ్రవాద సోదరులు హతమయ్యారు.












Click it and Unblock the Notifications