సౌదీ అరేబియాపై బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడులు-డీల్ కూడా లెక్కచేయని హూతీలు..!

సౌదీ అరేబియాకూ, యెమెన్ కు చెందిన హూతీ రెబెల్స్ తో (Houthis) సాగుతున్న పోరు మరింత తీవ్రమైంది. ఇప్పటికే సౌదీ అరేబియా రాజధాని రియాద్ తో పాటు పలు ప్రాంతాలపై విరుచుకుపడుతున్న ఇరాన్ మద్దతు గల హూతీలు.. ఇవాళ వాటిని మరింత తీవ్రతరం చేశారు. ముఖ్యంగా రియాద్ లోని సౌదీ రక్షణశాఖ కార్యాలయంపైనా, అలాగే మరో చమురు రిఫైనరీపైనా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డారు. హూతీలు పేల్చిన క్షిపణులు ఈ రెండు టార్గెట్లను తాకినట్లు సౌదీ అరేబియా నిర్ధారించింది.

భారత్ నిర్ణయం వెనుక అమెరికా బెదిరింపులు? ట్రంప్ మంత్రి క్లారిటీ..!
భారత్ నిర్ణయం వెనుక అమెరికా బెదిరింపులు? ట్రంప్ మంత్రి క్లారిటీ..!

ఇవాళ రియాద్‌లోని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖపై, ఆ దేశంలోని ప్రధాన రాస్ తానూరా చమురు శుద్ధి కర్మాగారంపై దాడులు చేసినట్లు హూతీ రెబెల్స్ ప్రకటించారు. అదే సమయంలో రాజధానిలో పేలుళ్లు సంభవించాయని వార్తలు వస్తున్నాయి. తమ దేశం వైపు హూతీలు ప్రయోగించిన క్షిపణులను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. తమ బృందం రక్షణ మంత్రిత్వ శాఖను బాలిస్టిక్ క్షిపణితో లక్ష్యంగా చేసుకుని నేరుగా దాడి చేసినట్లు హూతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ పేర్కొన్నారు. అయితే, రియాద్ వైపు ప్రయోగించిన రెండు హూతీ బాలిస్టిక్ క్షిపణులను తాము అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అధికారులు ప్రకటించారు.

Houthis Launch Ballistic Missile Strikes on Saudi Defence Ministry Oil Refinery Amid Peace Deal Offer
సౌదీ-హూతీల పోరులోకి పాకిస్తాన్..! యెమెన్ లో వైమానిక దాడులు, 8 వేల సైనికులు..!
సౌదీ-హూతీల పోరులోకి పాకిస్తాన్..! యెమెన్ లో వైమానిక దాడులు, 8 వేల సైనికులు..!

ఇరాన్ మద్దతు ఉన్న షియా గ్రూప్ అయిన హూతీ రెబెల్స్.. యెమెన్ లోని సున్నీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని సగం దేశాన్ని ఆక్రమమించుకుని పాలిస్తున్నారు. దీంతో మరో సున్నీ దేశం సౌదీ అరేబియాకూ, వీరికీ ఎప్పటి నుంచో పడటం లేదు. అయితే హూతీలను టార్గెట్ చేస్తూ గతంలో సౌదీ చేసిన ఓ దాడి వీరిద్దరి మధ్య పాత పగల్ని రగిల్చింది. అప్పటి నుంచి హూతీలు సౌదీ అరేబియాపై విరుచుకుపడుతున్నారు. సౌదీలోని ముస్లింల పవిత్ర స్థలాలైన మక్కా, మదీనా ప్రాంతాల సమీపంలో హూతీలు ప్రయోగించిన డ్రోన్లు గురితప్పాయి. అయితే ఈ పవిత్ర స్థలాల్ని హూతీలు టార్గెట్ చేయడంపై ముస్లిం, అరబ్ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా హూతీలు దాడులు ఆపడం లేదు. తాజాగా దాడులు ఆపితే మిలియన్ డాలర్ల సాయం అందిస్తామంటూ పాకిస్తాన్ మధ్యవర్తిగా సౌదీ చేసిన ప్రతిపాదననూ హూతీలు లెక్కచేయకుండా దాడులు కొనసాగిస్తుండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+