గోల్డ్ కార్డ్ విసా: భారతీయుల ఆశలపై నీళ్లు చల్లిన ట్రంప్?
Trump Gold Card: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ సంచలన నిర్ణయాలను తీసుకుంటోన్నారు డొనాల్డ్ ట్రంప్. భారత్ సహా పలు దేశాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవే అవన్నీ కూడా. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం మొదలుకుని నిధుల నిలిపివేత వరకూ ఆయన వేసిన ప్రతి అడుగూ ప్రకంపనలను పుట్టిస్తూ వచ్చినవే.
ఇప్పుడు తాజాగా అలాంటి మరో ప్రకటనే చేశారు డొనాల్డ్ ట్రంప్. గోల్డ్ కార్డ్ పేరుతో విసా ప్రోగ్రామ్‌ను ప్రకటించారు. దీని విలువ 5,000 మిలియన్ డాలర్లు. ప్రస్తుతం అమలులో ఉన్న ఈబీ- 4 విసా వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా దీన్ని అందుబాటులోకి తీసుకుని రావాలని భావిస్తోన్నట్లు తెలిపారు.

వైట్‌హౌస్ ఓవల్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. గ్రీన్ కార్డ్‌కు బదులుగా గోల్డ్ కార్డ్‌ను విక్రయించనున్నట్లు తెలిపారు. దీనికి గ్రీన్ కార్డ్ ప్రివిలేజెస్ ప్లస్ అని పేరు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. రెండు వారాల్లోగా దీన్ని అమలులోకి తీసుకుని వస్తామని అమెరికా కామర్స్ వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అమెరికా కేంద్రంగా పని చేసే మల్టీ నేషనల్ కంపెనీల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్. కంపెనీల యాజమానులను ధనవంతులుగా అభివర్ణించారు. చాలా డబ్బు ఖర్చు చేస్తుంటారని, అత్యధికంగా పన్నులు కడుతుంటారని వ్యాఖ్యానించారు. చాలా మందికి ఉపాధి కల్పిస్తారని పేర్కొన్నారు.
కొత్త గోల్డ్ కార్డ్ విసా ప్రోగ్రామ్ ఖచ్చితంగా విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు డొనాల్డ్ ట్రంప్. ఈబీ-5 వీసాలకు ప్రత్యామ్నాయంగా రెండు వారాల్లో ట్రంప్ గోల్డ్ కార్డ్‌ను కార్యాచరణలోకి తీసుకుని రావాలనేది తమ ఉద్దేశమని పేర్కొన్నారు. దీనిపై వర్కవుట్ చేస్తామనీ అన్నారు.
తమ దేశంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి 1990లో ఈబీ-5 విసాల ప్రక్రియకు తెర తీసింది అమెరికా. కనీసం 10 మంది ఉద్యోగులను నియమించే ప్రతి సంస్థ కూడా సుమారు ఒక మిలియన్ డాలర్లను వ్యయం చేసేలా దీనికి రూపకల్పన చేసింది. ఇప్పుడు గోల్డ్ కార్డ్‌ను ప్రతిపాదించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం అనేది భారతీయ సంస్థలకు అదనపు భారంగా పరిణమిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీనివల్ల అక్కడ పనిచేసే ఉద్యోగుల సంఖ్య తగ్గవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీతో సహా ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు సంపన్నులకు గోల్డెన్ వీసాలను అందిస్తోన్నాయని హెన్లీ అండ్ పార్టనర్స్ సంస్థ తెలిపింది.












Click it and Unblock the Notifications