దుబాయ్ ఎయిర్ షోలో .. పాక్ ఫైటర్ జెట్ ను పరిశీలించిన IAF పైలట్స్..!
యూఏఈలోని దుబాయ్ వరల్డ్ సెంట్రల్(DWC) లో దుబాయ్ ఎయిర్ షో- 2025 కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. నవంబర్ 17 నుంచి 21 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1500 లకుపైగా ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అలాగే 200 లకు పైగా ఎయిర్ క్రాఫ్ట్ లు ఫ్లైయింగ్ అలాగే డిస్ ప్లే కోసం సిద్ధం చేశారు. దుబాయ్ ఎయిర్ షో లో భాగంగా ఏవియేషన్, డిఫెన్స్ అండ్ స్పేస్ సెక్టార్లకు చెందిన టాప్ లీడర్లు హాజరయ్యారు. ప్రపంచ దేశాల అత్యాధునిక రక్షణ ఉత్పత్తులను పరిశీలించారు. ఆయా అడ్వాన్స్ డ్ టెక్నాలజీల గురించి అక్కడి ఎగ్జిబిటర్లను అడిగి తెలుసుకున్నారు.
అయితే దుబాయ్ ఎయిర్ షోలో పాకిస్థాన్ కు చెందిన ఫైటర్ జెట్స్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) పైలట్స్ పరిశీలించినట్లు సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి నిజమా లేదా ఎవరైనా ఫేక్ చిత్రాలు, వీడియోలను క్రియేట్ చేశారా..? అని తెలియాల్సి ఉంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఇలా ఇరు దేశాల సైనికాధికారులు కలుసుకోవడం.. మాట్లాడుకోవడం అభినందనీయం అని పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ ఫోటోలు, వీడియోలు నిజమా.. కాదా.. అని తెలియాల్సి ఉంది.
పాకిస్థాన్ కు చెందిన అత్యాధునిక జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) పైలట్లు, సిబ్బంది పరిశీలిస్తున్నట్లుగా అంతేకాక ఫైటర్ జెట్ వద్ద ఫోటోలు తీసుకోవడం.. వీడియోలు తీయడం చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య ఇలాంటి స్నేహపూర్వక వాతావరణంపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.

మరోవైపు యూఏఈలోని దుబాయ్ వరల్డ్ సెంట్రల్(DWC)లో అట్టహాసంగా జరుగుతున్న దుబాయ్ ఎయిర్ షో- 2025 కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విమాన ప్రదర్శన సమయంలో భారత్ కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఫైటర్ జెట్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలిలో భారీగా పొగలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications