బిగ్ రిస్క్ : తెలిసి తెలిసి భారత్ ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటుందా లేక బోరిస్‌కు నో చెప్తుందా?
రాబోయే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను భారత్ ఆహ్వానించడం... అందుకు ఆయన అంగీకరించడం తెలిసిందే. వారం రోజుల క్రితమే ఆయన భారత్ ఆహ్వానానికి ఓకె చెప్పారు. కానీ ఇంతలోనే పరిస్థితులు తలకిందులయ్యాయి. బ్రిటన్‌లో కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో బోరిస్ జాన్సన్ భారత్ పర్యటనపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఒకవేళ బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు వస్తే... అది మరో 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలా పరిణమించవచ్చునన్న అభిప్రాయాలు,ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బోరిస్ జాన్సన్‌ను రావొద్దని భారత్ కోరుతుందా... లేక తెలిసి తెలిసి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటుందా..? అన్న చర్చ జరుగుతోంది.
నివేదా పేతురాజ్ గ్లామరస్, బోల్డ్ ఫోటోలు.. అందానికి అందంగా బ్యూటీ

రద్దు చేసుకుంటారా..?
జన్యు క్రమాన్ని మార్చుకుని కొత్తగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ ప్రస్తుతం బ్రిటన్‌ను వణికిస్తోంది. పాత వైరస్ కంటే ఇది 70శాతం వేగంగా విస్తరిస్తున్నట్లు అక్కడి ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీంతో చాలావరకు ప్రపంచ దేశాలు ముందుగానే అప్రమత్తమై బ్రిటన్‌కు విమాన ప్రయాణాలను తాత్కాలికంగా నిషేధించాయి. భారత్ కూడా ఈ నెల 31 వరకు బ్రిటన్ విమాన సర్వీసులపై నిషేధాన్ని విధించింది. ఒకవేళ ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోతే ఈ నిషేధాన్ని మరిన్నిరోజులు పొడగించవచ్చు. ఒకవేళ పరిస్థితి అదుపులోకి వచ్చినా... ఇప్పుడప్పుడే బ్రిటన్‌కు రాకపోకలు శ్రేయస్కరం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో బ్రిటన్ ప్రధాని భారత్‌లో రిపబ్లిక్ డే వేడుకల పర్యటనను స్వయంగా రద్దు చేసుకుంటారా లేక భారతే ఆయన్ను రావొద్దని కోరుతుందా అన్నది సస్పెన్స్‌గా మారింది.
బోరిస్ వస్తే అంతే సంగతులు..?
ఇప్పటికే చాలామంది నెటిజన్లు బోరిస్ జాన్సన్ భారత పర్యటనపై ట్విట్టర్‌లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బోరిస్ జాన్సన్ భారత్‌కు రావడమంటే... అది మరో 'నమస్తే ట్రంప్' కార్యక్రమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుజరాత్‌లో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమంతో భారత్‌లో కరోనా వ్యాప్తి పెరిగిందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు బ్రిటన్‌లో పరిస్థితి గురించి తెలిసి మరీ బోరిస్ జాన్సన్‌తో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం దేశంలో 'కోవిడ్ 2.0'కి దారులు తెరవడమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
రద్దు చేయాలంటున్న నెటిజన్లు...
ఒకవేళ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు వస్తే ఆయన వెంట ఎంత లేదన్నా 100 నుంచి 200 మంది అధికారులు భారత్ వస్తారు. వీళ్లలో ఎవరికి కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్ లక్షణాలున్నా అది ఇక్కడ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి నమస్తే ట్రంప్ కార్యక్రమంతో చేసిన తప్పిదాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి రిపీట్ చేయవద్దని నెటిజన్లు కోరుతున్నారు. బోరిస్ జాన్సన్ పర్యటనను రద్దు చేయాలని కోరుతున్నారు.

జన్యు క్రమాన్ని విశ్లేషించే పనిలో శాస్త్రవేత్తలు
బ్రిటన్‌లో వెలుగుచూసిన కోవిడ్ 19 కొత్త స్ట్రెయిన్‌ని అర్థం చేసుకునేందుకు,దాని జన్యు క్రమాన్ని విశ్లేషించేందుకు అక్కడి పరిశోధకులు,శాస్త్రవేత్తలు ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి ఒక్క లండన్ నగరంలోనే 60శాతం ఉన్నట్లు రిపోర్టులు చెప్తున్నాయి. బోరిస్ జాన్సన్ మాత్రం ఇప్పుడప్పుడే దాని గురించి ఏమీ మాట్లాడలేమంటున్నారు. మరోవైపు కొత్త స్ట్రెయిన్ అంత ప్రమాదకరమేమీ కాదని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ.. కరోనా కారణంగా చవిచూసిన చేదు అనుభవాల దృష్ట్యా ప్రపంచమంతా ఇప్పుడు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కోవిడ్ 19 కొత్త స్ట్రెయిన్‌తో ప్రమాదమేమీ లేదని డబ్ల్య్యూహెచ్ఓ నుంచి స్పష్టత వస్తే తప్ప ప్రపంచ దేశాలు బ్రిటన్‌తో సంబంధాలను అంత త్వరగా పునరుద్దరించవనే చెప్పాలి.












Click it and Unblock the Notifications