Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కోసం ఏకమైన 21 మాజీ కెప్టెన్లు- భారత్ నుంచి వీరే..!

పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కూడా అయిన ఇమ్రాన్ ఖాన్ (imran khan)ను అక్కడి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మూడేళ్లుగా అక్రమ కేసులతో వేధిస్తోంది. వరుస కేసులు పెట్టి జైల్లో నుంచి బయటికి రాకుండా అడ్డుకుంటోంది. చివరికి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తున్నా, ఓ కంటి చూపు కోల్పోయినా ఆస్పత్రికి కూడా తరలించకుండా జైల్లోనే ఉంచేసింది. దీంతో అక్కడి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మరీ ఇమ్రాన్ కు వైద్య చికిత్స అందించాలని ఆదేశాలు ఇచ్చింది. దీన్ని కూడా కోర్టులో సవాల్ చేసిన పాక్ ప్రభుత్వం.. తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు తమతో కలిసి ఆడిన ఇమ్రాన్ కోసం మాజీ కెప్టెన్లు స్పందిస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్లో వివిధ దేశాల జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించిన మొత్తం 21 మంది ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుగా ముందుకొచ్చారు. ఇందులో భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కూడా ఉన్నారు. వీరంతా ఇమ్రాన్ ఖాన్‌కు మానవతా దృక్పథంతో సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుతూ ప్రధాని ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఇందులో వారు ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించి పలు విషయాలు ప్రస్తావించారు. ఆరు నెలల క్రితం, 14 మంది మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు ఇమ్రాన్ ఖాన్‌కు మానవతా దృక్పథంతో కూడిన చికిత్స, సరైన వైద్య సంరక్షణ అందించాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసినట్లు పాక్ ప్రధానికి గుర్తుచేశారు.

Imran Khan Care Row Gavaskar Kapil Dev and 19 Former Captains Appeal to Pakistan Government

అప్పుడు తాము రాజకీయ నాయకులుగా కాకుండా, క్రికెట్ మైదానంలో ఏర్పడిన ఒక బంధాన్ని పంచుకునే మాజీ సహచరులుగా, ప్రత్యర్థులుగా రాశామని, ఈ బంధం, దేశాలను తరచుగా విభజించే సరిహద్దులు, వివాదాలకు అతీతమైనదని వారు తెలిపారు.
ఇప్పుడు మరో ఏడుగురు మాజీ కెప్టెన్లతో కలిసి మళ్ళీ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను ఆసుపత్రికి తరలించి, అక్కడ అతని వ్యక్తిగత వైద్యులు, అతని సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్‌తో కూడిన ఒక వైద్య బోర్డు ద్వారా పరీక్షించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించిందని, వారానికి ఒకసారి కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా కోర్టు అనుమతినిచ్చిందని, ఇవి చాలా స్వాగతించదగిన చర్యలని తెలిపారు. అయినా ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రిలో కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉన్నారని, కోర్టు ఆదేశించిన బోర్డుకు బదులుగా, ప్రభుత్వం నియమించిన బృందం ఆయనను పరీక్షించి, వైద్యపరంగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించి, ఆ బోర్డు తన పనిని పూర్తి చేయకముందే ఆదియాలా జైలుకు తిరిగి పంపించారని ఆరోపించారు. పాకిస్తాన్ దేశీయ న్యాయ ప్రక్రియలపై తీర్పు చెప్పే అధికారం తమకు లేదని, అది తమ పరిధి కూడా కాదన్నారు.

Imran Khan Care Row Gavaskar Kapil Dev and 19 Former Captains Appeal to Pakistan Government

కానీ సుప్రీంకోర్టు ఆదేశించిన వైద్య బృందాన్ని ఖాన్ సొంత వైద్యులతో సహా ఆయన ఆరోగ్యంపై, ముఖ్యంగా ఆయన కుడి కంటి చూపు కోల్పోయినట్లుగా వచ్చిన వార్తలపై, పూర్తి, స్వతంత్ర అంచనాను పూర్తి చేయడానికి అనుమతించాలని వారు కోరారు.
కోర్టు పునరుద్ధరించిన వారపు కుటుంబ సభ్యుల సందర్శనలను ఎలాంటి అంతరాయం లేదా పరిపాలనా జాప్యం లేకుండా కొనసాగించాలన్నారు. ఆ వైద్య రిపోర్టుల ఫలితం ఎలా ఉన్నప్పటికీ, అది సిఫార్సు చేసిన చికిత్సను ఆలస్యం లేకుండా అందించాలన్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు 73 ఏళ్లని , ఆయన ఇప్పుడు మూడు సంవత్సరాలకు పైగా నిర్బంధంలో ఉన్నారని, కేసుకు సంబంధించి చట్టపరమైన, రాజకీయ వాదనలు ఏవైనప్పటికీ, కోర్టు ఆదేశించిన వైద్య ప్రక్రియ వాస్తవంగా పూర్తయ్యేలా చూడటం అనే ప్రాథమిక బాధ్యత, మా దృష్టిలో, వివాదాస్పదమైన అభ్యర్థన కాదని మాజీ కెప్టెన్లు తెలిపారు. పాక్ ప్రధానికి ఈ లేఖ రాసిన కెప్టెన్లలో మైఖేల్ అధర్టన్, అలెక్స్ బ్లాక్ వెల్, అలెన్ బోర్డర్, మైకేల్ బ్రియర్లీ, గ్రెగ్ ఛాపెల్, ఇయాన్ ఛాపెల్, బెలిండా క్లార్క్, అలిస్టర్ కుక్, సునీల్ గవాస్కర్, లీ జెర్మోన్, ఆడం గిల్ క్రిస్ట్, డేవిడ్ గోయర్, కిమ్ హ్యూగ్స్, నాసిర్ హుస్సేన్, క్లైవ్ లాయిడ్, కపిల్ దేవ్, అర్జున రణతుంగ, ఆండ్రూ స్ట్రాస్, దిలీప్ వెంగ్సర్కార్, స్టీవ్ వా, జాన్ రైట్ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+