మహిళ నేతకు ఇమ్రాన్‌ఖాన్ అశ్లీల మేసేజ్, పార్టీకి గుడ్‌బై

మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌పై ఆ పార్టీకి చెందిన మహిళ నేత ఆరోపణలు అశ్లీల సందేశాలను పంపారని ఆమె ఆరోపణలు చేశారు.

ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పిటీఐ) అధినేత ఇమ్రాన్‌ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆ పార్టీ మహిళ నేత ఎంఎన్ఏ అయేషా గులాలై రాజీనామా చేశారు.

ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యక్తిత్వం లేదని ఆమె ఆరోపించారు. తనకు పార్టీలోని ఇతర మహిళా నేతలకు అశ్లీల , అసభ్య సందేశాలు పంపేవారని ఆమె మండిపడ్డారు. పాక్ నూతన ప్రధానిగా అబ్బాస్సీ ప్రమాణం చేసిన సమయంలోనే ఆమె పీటీఐ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

Imran Khan used to send me lewd messages

వ్యక్తిత్వం , గౌరవమర్యాదలే తనకు ముఖ్యమని ఆ విషయంలో రాజీపడలేక పీటీఐ రాజీనామా చేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. పీటీఐలో మహిళా శ్రేణులకు గౌరవం లేదన్నారు. గౌరవప్రదమైన మహిళలెవరూ పార్టీలో పనిచేయలేదన్నారు.

అయితే, ఆమె ఆరోపణలను పీటీఐ మహిళా నేత చీప్ విప్ షిరీన్ మజారీ తోసిపుచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అయేషాకు టిక్కెట్టు నిరాకరించడంతోనే ఆమె ఈ ఆరోపణలు చేశారని, పార్టీలోని మహిళలందరినీ ఇమ్రాన్‌ఖాన్ గౌరవిస్తారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+