ఐరాసలో అనూహ్య పరిణామం-భారత్ మద్దతుతో పంతం నెగ్గించుకున్న పాకిస్తాన్.. !

చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాకిస్తాన్ లు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది ? దీనికి సమాధానం ఐక్యరాజ్యసమితిలో దొరికింది. ఐరాసలో గతంలో ఎన్నో అంశాల్లో విభేదిస్తూ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకునే ఇరుదేశాలు ఈసారి మద్దతిచ్చుకున్నాయి. దీని ఫలితంగా భారత్ పై నిత్యం విషం కక్కే పాకిస్తాన్ ఐరాసలో తన పంతం నెగ్గించుకుంది. భారత్ తో పాటు చైనా కూడా ఈ విషయంలో పాకిస్తాన్ కు అండగా నిలిచాయి.

యూరప్ లోని స్వీడన్ లో ఖురాన్ దహనం ఘటన కలకలం రేపుతోంది. దీనికి నిరసనగా ఐరాసలో పాకిస్తాన్, పాలస్తీనా దేశాలు ఓ తీర్మానం ప్రవేశపెట్టాయి. ఐరాస మానవ హక్కుల మండలిలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై సభ్య దేశాలు తమ అభిప్రాయాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఖురాన్ దహనం ద్వారా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన స్వీడన్ పై చర్యలు కోరుతూ పాకిస్తాన్-పాలస్తీనా తీర్మానం ప్రవేశపెట్టి భారత్ మద్దతు కోరాయి.

in big surprise, pakistan won its resolution with indias support in UNO

దీనికి స్పందనగా భారత్ మద్దతివ్వాలని నిర్ణయించింది. మానవ హక్కుల విషయంలో తమ వైఖరికి అనుకూలంగా ఉండటంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో చైనాతో పాటు పలు దేశాలు కూడా పాకిస్తాన్-పాలస్తీనా తీర్మానానికి అండగా నిలిచాయి. దీంతో తీర్మానం 28-12 తేడాతో నెగ్గింది. దీంతో ఐరాస ఛాంబర్లో హర్షధ్వానాలు వినిపించాయి. సరిహద్దులు,తీవ్రవాదం వంటి అంశాల్లో పరస్పరం కలహించుకుంటున్నా భారత్.. పాకిస్తాన్ తీర్మానానికి మద్దతివ్వడంపై సభ్యదేశాలు సైతం హర్షం వ్యక్తం చేశాయి.

ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో ఇటీవల ఖురాన్ దహనం జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్-పాలస్తీనా ఈ తీర్మానం తీసుకొచ్చాయి. వివక్ష, శత్రుత్వం, హింసను ప్రేరేపించే చర్యలను, మతపరమైన విద్వేషాన్ని సమర్థించే చర్యలను నిరోధించడానికి, విచారించడానికి సభ్య దేశాలు చర్యలు తీసుకోవాలని ఈ రెండు దేశాలు పిలుపునిచ్చాయి. ఈ ఓటింగ్ తర్వాత, పాకిస్తాన్ రాయబారి ఖలీల్ హష్మీ ఈ చర్య స్వేచ్ఛా వాక్ స్వాతంత్ర హక్కును తగ్గించడానికి ప్రయత్నించడం లేదని క్లారిటీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+