చిన్నారి గదిలో నల్లతాచు: షాక్ తిన్న తండ్రి (వైరల్ వీడియో)

Subscribe to Oneindia Telugu
  చిన్నారి గదిలో నల్లతాచు: షాక్ తిన్న తండ్రి

  కాన్‌బెర్రా: ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు కానీ.. నల్లగా నిగనిగలాడుతూ బుసలు కొడుతున్న ఓ నల్లతాచు.. ఓ చిన్నారి గదిలోకి దూరిపోయింది. చిన్నారి వరుసగా పేర్చుకున్న టాయ్స్‌లో దూరిపోయి అందులో దాక్కుండిపోయింది. చిన్నారి తండ్రి గదిలోకి వచ్చి కనిపెట్టేంతవరకు.. అది అందులోనే అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయింది.

  ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ అమెరికా' అనే స్థానిక మీడియా ద్వారా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

  చిన్నారి గదిలోకి వెళ్లిన ఆ తండ్రి.. టాయ్స్ మధ్యలో కదులుతూ కనిపించిన పామును చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆ సమయంలో చిన్నారి గదిలో లేనందుకు ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే పాములు పట్టే అతనికి ఫోన్ చేసి.. పాము ఎక్కడికి వెళ్లకుండా తలుపులు, కిటికీలు మూసేశాడు.

  అనంతరం స్నేక్ క్యాచర్ వచ్చి దాన్ని బంధించడంతో ఆ చిన్నారి తండ్రితో పాటు అతని భార్య హమ్మయ్యా అనుకున్నారు. ఆపై స్నేక్ క్యాచర్ దీనికి సంబంధించిన వీడియోను తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేయడంతో.. ఇది కాస్త వైరల్‌గా మారింది. దీంతో నెటిజెన్స్ దీనిపై పలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటన నాకే గనుక ఎదురైతే.. అక్కడికక్కడే చచ్చిపోతా అంటూ ఓ నెటిజెన్ ఫన్నీ కామెంట్ చేయడం గమనార్హం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In today's edition of 'it happens only in Australia', a man found a scary and venomous snake hiding in his daughter's room and had to call in a pro for help. A video, posted on Andrew's SNAKE Removal Facebook page

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X