IAF Operation: సూడాన్‍లో భారత వైమానిక దళం డేరింగ్ ఆపరేషన్..

అంతర్గత సంక్షోభంలో ఉన్న సూడాన్ నుంచి భారతీయులను రక్షించేందుకు భారత వైమానిక దళం కీలక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ ను ఏప్రిల్ 27 నుంచి 28 మధ్య రాత్రి 121 మందిని తరలించేందుకు నిర్వహించింది. సూడాన్‌ రాజధాని ఖార్తూమ్‌కు దగ్గర్లో ఉన్న వాది సయ్యిద్నాలో ఉన్న ఒక చిన్నపాటి రన్‌వే పై దిగిన C-130J విమానం ఈ ఆపరేషన్‌లో భాగమైంది. ప్రయాణికుల్లో పలు వ్యాధులున్న వారితో పాటు గర్భిణీ స్త్రీ కూడా ఉంది. సయ్యిద్నాలోని ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ అవ్వడానికి సరైన సదుపాయాలు లేవు. లైట్లు కూడా లేవు. రన్ వే కూడా గుంతలుగా ఉంది. చుట్టు పక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి.

అయిన భారత వైమానిక దళ విమానే సీ-130J పైలట్ ఇన్ ఫ్రాడ్ వేవ్ సహాయంతో అక్కడ ఎవరు లేరని తెలుసుకున్నారు. ఆ తర్వాత విమానాన్ని సురక్షింతంగా ల్యాండ్ చేశారు. ఎయిర్‌క్రూ తమ ఎలక్ట్రో-ఆప్టికల్ మరియు ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌లను ఉపయోగించి రన్‌వేకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేలా చూసుకున్నారని ఓ అధికారి తెలిపారు. "ల్యాండింగ్ తర్వాత, ఎనిమిది మంది IAF గరుడ్ కమాండోలు ప్రయాణీకులను, వారి లగేజీని విమానంలోకి సురక్షితంగా విమానంలోకి ఎక్కించారు. అప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌లు రన్ అవుతూనే ఉన్నాయి. ల్యాండింగ్ మాదిరిగానే, నైట్ విజన్ గాగుల్స్ ఉపయోగించి వెలుతురు లేని రన్‌వే నుంచి టేకాఫ్ కూడా జరిగింది" అని ఆయన చెప్పారు.

 sudan

అయితే, భద్రతా కారణాల దృష్ట్యా, సంబంధిత C-130J-30 ఎక్కడ ఆధారపడి ఉందో వెల్లడించడానికి IAF నిరాకరించింది. C-130J కొనుగోళ్లకు సంబంధించి ఒప్పందాలపై 2009లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో సంతకాలు జరిగాయి. సయ్యద్నా, జెద్దా మధ్య సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్ IAF చరిత్రలో నిలిచిపోతుందని IAF అధికారి తెలిపారు. ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత కాబూల్ నుంచి భారతీయులను తరలించడానికి భారత వైమానిక దళం ఇలాంటి కార్యకలాపాలను చేపట్టింది. సూడాన్ దేశ సైన్యం మరియు పారామిలటరీ గ్రూపు మధ్య జరిగిన పోరులో దాదాపు 400 మంది మరణించినట్లు తెలిసింది.

సూడాన్‌లో చిక్కుకుపోయిన 3,500 మంది భారతీయ పౌరులను తరలించడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ కావేరి ఇటీవల ప్రారంభించింది. సూడాన్ లో చిక్కున్న భారతీయులను ఇప్పటికి వరకు ఇండియాకు తరలించిన వారి సంఖ్య 1,360కి చేరుకుంది. ఈ డేరింగ్ ఆపరేషన్‌లో C-130J విమానానికి గ్రూప్‌ కెప్టెన్‌ రవి నందా నాయకత్వం వహించారు. అఫ్గానిస్థాన్‌లో కూడా ఆయన ఈ తరహా ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి కేంద్రం గ్యాలంటరీ మెడల్‌ను ఇచ్చి సత్కరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+