వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాకు భారత్ షాక్ -ఓటింగ్ లో మద్దతు ఇవ్వకుండా : చైనా మద్దతు - అనూహ్య నిర్ణయం వెనుక..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్యసమితి వేదికగా రష్యాకు భారత్ షాక్ ఇచ్చింది. తమ వైఖరి ఏంటో మరోసారి స్పష్టం చేసింది. ఉక్రెయిన్ పైన రష్యా యుద్దం నేపథ్యంలో ఇప్పటి వరకు రష్యాకు వ్యతిరేకంగా ప్రతిపాదించిన తీర్మాణాల ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు రష్యా ప్రతిపాదించిన తీర్మానం పైన ఓటింగ్ విషయంలోనూ దూరంగా ఉంటూ రష్యాకు ఊహించని షాక్ ఇచ్చింది. అయితే ,దీని ద్వారా తాము ఈ మొత్తం వ్యవహారం ఎవరికీ అనుకూలం కాదు.. వ్యతిరేకం కాదు..తటస్థంగా ఉండటమే తమ వైఖరి అని మరోసారి ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ స్పష్టం చేసింది.

రష్యా తీర్మానానికి దూరంగా భారత్

రష్యా తీర్మానానికి దూరంగా భారత్

ఉక్రెయిన్ లో నెలకొన్న మనావతా సంక్షోభం పైరష్యా ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ప్రతిపాదించింది. ఈ తీర్మానం ఓటింగ్ విషయంలో భారత్ తో సహా 12 దేశాలు దూరంగా ఉన్నాయి. అయితే, ఈ తీర్మానంలో రష్యాకు మద్దతుగా నిలిచిన ఏకైక దేశం చైనా. ఆమోదించడానికి అవసరమైన తొమ్మిది అనుకూల ఓట్లు రాకపోవటంతో తీర్మానం వీగిపోయింది. రష్యా తన ముసాయిదా తీర్మానంపై 15 దేశాల భద్రతా మండలిలో ఓటు వేయాలని పిలుపునిచ్చింది. తీర్మానంపై ఓటింగ్ తర్వాత ఇతర కౌన్సిల్ సభ్యులు ప్రకటనలు చేయగా, భారత్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

తటస్థ వైఖరే తమ విధానమంటూ

తటస్థ వైఖరే తమ విధానమంటూ

ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించిన తీర్మానాలకు భారత్ గతంలో భద్రతా మండలిలో రెండు పర్యాయాలు, జనరల్ అసెంబ్లీలో ఒకసారి గైర్హాజరైంది. తాజా తీర్మానం సమయంలో భద్రతా మండలిలోని 13 మంది సభ్యులు ఉక్రెయిన్‌లో సృష్టించిన మానవతా సంక్షోభానికి కారణమంటూ రష్యా తీర్మానానికి దూరంగా ఉన్నారు. యుఎన్‌లోని యుఎస్ రాయబారి లిండా థామస్ రష్యా తీరును తప్పు బట్టారు. ఉక్రెయిన్ లోని పరిస్థితులకు రష్యా కారణమని చెప్పుకొచ్చారు.

చర్చల ద్వారానే పరిష్కారమని సూచన

చర్చల ద్వారానే పరిష్కారమని సూచన

రష్యా దురాక్రమణ కారణంగానే ఉక్రెయిన్ లో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ధ్వజమెత్తారు. రష్యా సృష్టించిన సంక్షోభం పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. యూకే ప్రతినిధి సైతం తమ వైఖరి స్పష్టం చేసారు. భద్రతా మండలిలో ..అదే విధంగా జనరల్ అసెంబ్లీలో ఏ ఓటింగ్ లోనూ మద్దతు ఇవ్వదని తేల్చి చెప్పారు. భద్రతా సమితిలో ప్రతిపాదించిన తాజా మూడు తీర్మానాల్లో రష్యా ప్రతిపాదిత తీర్మానం ఒకటి. ఇప్పటికే యూ
ఎన్ ఓ వేదికగా తాము యుద్దానికి వ్యతిరేకమని..చర్చల ద్వారానే సమస్య పరిష్కారమని నమ్ముతున్నామని స్పష్టం చేసింది.

English summary
India, along with 12 other UN Security Council members, abstained on a resolution by Russia on the humanitarian crisis in Ukraine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X