ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)వేదికగా భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ పక్షాన భారత్ గట్టిగా వాదించింది. ఆ దేశంలో ఐక్యరాజ్యసమితి ఆంక్షలను సమీక్షించాలని భారత్ డిమాండ్ చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ.. ఆప్ఘనిస్తాన్‌లో రాజకీయ పరిస్థితి గణనీయంగా మారిందని పేర్కొన్నారు. అందువల్ల ఆఫ్ఘనిస్థాన్‌పై ఎప్పటి నుంచో అమల్లో ఉన్న ఐక్యరాజ్యసమితి ఆంక్షల విధానాన్ని తక్షణమే పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ నిరంతరం వైమానిక దాడులు జరుపుతున్న సమయంలో భారత్ ఈ ప్రకటన చేసింది.
ఆఫ్ఘనిస్తాన్‌పై ఆంక్షలను ఎత్తివేయాలి.. భారత్ డిమాండ్
ఆఫ్ఘనిస్తాన్‌పై ప్రస్తుతం అమలవుతున్న శిక్షాత్మక చర్యలు, ఆంక్షలు తమ ప్రభావాన్ని పూర్తి కోల్పోయామని పర్వతనేని హరీష్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో చర్చల కోసం అంతర్జాతీయ సమాజం ఓ కొత్త విధానాన్ని అవలంభించాలని ఆయ కోరారు. ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను కూడా హరీష్ ఖండించారు. ఈ దాడుల వల్ల గణనీయమైన ప్రాణనష్టం జరిగిందని ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐక్యరాజ్యసమితి సహాయక మిషన్ నివేదికలను పేర్కొంటూ.. పాకిస్థాన్ చర్యలు ప్రాంతీయ శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని భారత్ పేర్కొంది.

పాకిస్థాన్ దాడులను ఖండించిన భారత్
ఆఫ్ఘనిస్తాన్‌తో వాణిజ్యం, రవాణాపై పాకిస్తాన్ ఆంక్షలు విధిస్తోందని భారత ప్రతినిధి బృందం ఆరోపించింది. వాటిని తొలగించాలని డిమాండ్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఓ భూపరివేష్టిత దేశం.. అంతర్జాతీయ వాణిజ్యం కోసం చాలా కాలంగా పాకిస్తాన్‌పై ఆధారపడి ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్తాన్ దీనిని అవకాశంగా వాడుకుంటోంది. పాకిస్తాన్ ఆఫ్ఘన్ సరిహద్దును పూర్తిగా మూసివేసింది. దీనివల్ల వస్తువుల రవాణాకే కాకుండా ప్రజల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. తక్షణమే ఈ అక్రమ రవాణా ఆంక్షలను ఎత్తివేయాలని భారత్ గట్టిగా డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications