Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రష్యాతో భారత్ బిగ్గెస్ట్ డీల్.. నెలకు రూ. 2.32 లక్షల కోట్లతో..!

అమెరికా ఆంక్షలు విధించినా.. రష్యా నుంచి చమురు కొనుగోలులో భారత్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. రష్యా నుంచి ఇంధనం కొనుగోలులో భారత్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్(CREA) సంస్థ వెల్లడించింది. ఒక్క అక్టోబర్ నెలలోనే దాదాపు 2.5 బిలియన్ యూరోల విలువ కలిగిన చమురును రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసినట్లు స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రష్యా నుంచి శిలాజాలు, ఇంధన కొనుగోళ్లలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.

రష్యా నుంచి 2.5 బిలియన్ యూరోల విలువ కలిగిన చమురును అక్టోబర్ నెలలో భారత్ కొనుగోలు చేసినట్లు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్(CREA) సంస్థ తాజాగా వెల్లడించింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు విషయంలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక మొదటి స్థానంలో చైనా ఉన్నట్లు తెలిపింది. అయితే అక్టోబర్ 22న రష్యాలోని చమురు సంస్థలైన రోస్ నెఫ్ట్, లూక్ ఆయిల్ పై అమెరికా ఆంక్షలు విధించింది. చమురు వాణిజ్యంపై వచ్చిన లాభాలను రష్యా.. ఉక్రెయిన్ పై యుద్ధానికి ఖర్చు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో చాలాసార్లు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో అక్టోబర్ 22న ఈ ఆయిల్ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది.

అయితే అమెరికా ఆంక్షలతో భారత్ లోని ఆయిల్ రిఫైనరీ సంస్థలైన రిలయన్స్, హెపీసీఎల్- మిట్టల్, మంగళురు రిఫైనరీ, పెట్రో కెమికల్స్ లిమిటెడ్.. తమ కొనుగోళ్లను నిలిపివేశాయి. మరోవైపు రష్యా.. అక్టోబర్ లో భారత్ కు 60 మిలియన్ బారెల్స్ క్రూడ్ ఆయిల్ ను ఎగుమతి చేసింది. కేవలం రోస్ నెఫ్ట్, లూక్ ఆయిల్ సంస్థల నుంచే దాదాపు 45 మిలియన్ బారెల్స్ ముడి చమురు ఎగుమతి అయినట్లు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్(CREA) సంస్థ తెలిపింది.

India Buys 232 000 crore Russian Oil in Just ONE Month CREA Report Shocks the West

గతంలో మిడిల్ ఈస్ట్ దేశాలపై ఆధార పడిన భారత్.. 2022 ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రారంభం నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. ఇదే క్రమంలో రష్యా ముడి చమురుపై డిస్కౌంట్లు పెట్టడంతో భారత్ లాంటి అనేక దేశాలు రష్యాతో వాణిజ్యం పెంచుకున్నాయి. దాంతో రష్యా నుంచి భారత్.. ముడి చమురు కొనుగోలు 1 శాతం నుంచి కొద్దికాలంలోనే దాదాపు 40 శాతానికి పెరిగింది. సెప్టెంబర్ లో 3.6 బిలియన్ యూరోల చమురును భారత్ దిగుమతి చేసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+