వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాస్కో-కీవ్ మధ్య భారత్ మధ్యవర్తిత్వం వహించగలదు : రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోస్

|
Google Oneindia TeluguNews

మాస్కో-ఉక్రెయిన్ మధ్య భారతదేశం మధ్యవర్తిత్వం వహించగలదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ చాలా ముఖ్యమైన దేశం. సమస్య పరిష్కారాన్ని అందించే పాత్ర భారతదేశం పోషించాలని చూస్తే.. అంతర్జాతీయ సమస్యల పట్ల న్యాయమైన, హేతుబద్దమైన దృక్ఫథంతో ఉన్నట్లయితే అటు ప్రక్రియకు మద్దతివ్వవచ్చని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోస్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, మన దేశ విదేశాంగ మంత్రి జై శంకర్‌తో సమావేశమయ్యారు.

భార‌త్ కోరుకుంటే పంపిస్తాం..
భారతదేశం త‌మ‌కు అత్యంత మఖ్యమైన మిత్రదేశమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోస్ కొనియాడారు. ఎన్నో దశాబ్ధాలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తమ దేశం నుంచి భారత్ ఏమైనా కొనాలని కోరుకుంటే.. చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మన దేశ విదేశాంగ మంత్రి ఎస్ . జైశంకర్‌తో భేటీ అనంతరం సెర్గీ లవ్రోస్ మీడియాతో మాట్లాడారు. ఇండియాతో సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యమ‌ని చెప్పారు. ఈ ప్రాతిపతికపైనే తాము అన్ని రంగాల్లోనూ ఇరుదేశాలు తమ సహకారాన్ని వృద్ధి చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. రక్షణ రంగంలో భారత్ కు పరస్పర సహకారం అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్ఫష్టం చేశారు.

India can play mediators role between Moscow and Kyiv says Russian FM Lavrov

భార‌త్ - ర‌ష్యాపై అమెరికా ఒత్తిడి ప్ర‌భావం చూప‌దు
ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా , పాశ్చాత్య దేశాల ఒత్తిళ్ల ప్రభావం భారత్-రష్యా సంబంధాలపై పనిచేయదని సెర్గీ లవ్రోస్ తేల్చిచెప్పారు. అమెరికా తమ రాజకీయలను అనుసరించి ఇతర దేశాలపై ఒత్తిడీ చేయాలని చూస్తోందని విమర్శించారు. భాతరదేశ విదేశాంగ విధానాలు స్వతంత్ర లక్షణం కలవని .. వీటి ప్రధాన దృష్టి జాతీయ చట్టబద్ధమైన ప్రయోజనాలపై ఉంటుందని పేర్కొన్నారు. భారత్‌కు అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. అటు ఉక్రెయిన్ పై రష్యా చేస్తుంది యుద్ధం కాదు. ఇది ఒక ప్రత్యేకమైన సైనికచర్య అని తెలిపారు. రష్యాకు ముప్పు కలిగించే శక్తి, సామర్థ్యం ఉక్రెయిన్ కు లేకుండా చేయడమే తమ లక్ష్యమని సెర్గీ లవ్రోస్ పేర్కొన్నారు.

English summary
India can play mediator's role between Moscow and Kyiv says Russian FM Lavrov
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X