అత్యంత అరుదైన ఖనిజంపై కన్నేసిన భారత్, రష్యాతో సీక్రెట్ డీల్!

భవిష్యత్తు ఇంధన అవసరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), రక్షణ రంగానికి అత్యంత కీలకమైన 'రేర్ ఎర్త్' (అరుదైన ఖనిజాల) సరఫరాలో చైనా గుత్తాధిపత్యానికి గండి కొట్టేందుకు భారతదేశం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ఇందులో భాగంగా రష్యాలోని అత్యంత శీతల ప్రాంతమైన సైబీరియాలోని 'టామ్‌టర్' (Tomtor) ఖనిజ నిక్షేపాలపై భారత్ కన్నేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని 'ఐఆర్ఈఎల్' (IREL - ఇండియా రేర్ ఎర్త్ లిమిటెడ్), రష్యాకు చెందిన ప్రముఖ చమురు సంస్థ 'రోస్నెఫ్ట్' (Rosneft) తో రేర్ ఎర్త్ ఖనిజాల శాంపిల్స్ సేకరణ కోసం ముమ్మర చర్చలు జరుపుతున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.

ప్రభుత్వ మార్గాల ద్వారా రహస్య చర్చలు..

గత ఏడాది రోస్నెఫ్ట్ సంస్థ హస్తగతం చేసుకున్న సైబీరియాలోని 'యాకుటియా' ప్రాంతంలో ఉన్న టామ్‌టర్ డిపాజిట్, ప్రపంచంలోనే ఇంకా వెలికితీయని అతిపెద్ద రేర్ ఎర్త్ నిక్షేపాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. లభించిన సమాచారం ప్రకారం.. ఇరు దేశాల మధ్య ఈ చర్చలు అత్యున్నత ప్రభుత్వ మార్గాల ద్వారా సాగుతున్నాయి. ఈ ఖనిజ శాంపిల్స్‌ను మొదట రష్యాలోనే ప్రాసెస్ చేసి, ఆ తర్వాత తదుపరి పరిశోధనల కోసం భారతదేశానికి రవాణా చేయనున్నారు. ఈ నిక్షేపాల్లోని ఖనిజాల నాణ్యత, మిశ్రమంపై స్పష్టత వచ్చిన తర్వాతే భారత్ ఇందులో మరింత లోతుగా పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉంది. చైనాతో సరిహద్దు సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో, ఈ అరుదైన ఖనిజాల కోసం చైనాపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని భారత్ భావిస్తోంది.

India Eyes Russias Tomtor Deposit in Siberia for Rare Earth Minerals to Cut Dependence on China
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇసుక.. ఎడారి దేశంలో వింత వ్యాపారం!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇసుక.. ఎడారి దేశంలో వింత వ్యాపారం!

రేర్ ఎర్త్ ఖనిజాలు ఎందుకు అంత కీలకం?

ఎలక్ట్రిక్ వాహనాల (EV) మోటార్లలో వాడే శక్తివంతమైన శాశ్వత అయస్కాంతాల (Permanent Magnets) తయారీకి, క్లీన్ ఎనర్జీ పరికరాలకు మరియు అత్యాధునిక రక్షణ రంగానికి ఈ రేర్ ఎర్త్ మూలకాలు ప్రాణాధారం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాల సరఫరా వ్యవస్థపై చైనా పూర్తి నియంత్రణ కలిగి ఉంది. భారతదేశంలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద రేర్ ఎర్త్ నిక్షేపాలు (సుమారు 7.23 మిలియన్ మెట్రిక్ టన్నులు) ఉన్నప్పటికీ, వాటిని వాణిజ్య స్థాయిలో అత్యంత స్వచ్ఛమైనదిగా మార్చి.. వేరుచేసే (Refining & Separation) అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు ప్రస్తుతం దేశంలో లేవు. అందుకే గతేడాది నవంబర్‌లో భారత ప్రభుత్వం రేర్ ఎర్త్ మాగ్నెట్ తయారీ రంగానికి మద్దతుగా రూ.7,300 కోట్ల ($770.77 మిలియన్లు) భారీ ప్యాకేజీని కూడా ఆమోదించింది.

స్వర్ణ నిధితో బయటపడిన 500 ఏళ్ల నాటి 'బోమ్ జీసస్’ నౌక..
స్వర్ణ నిధితో బయటపడిన 500 ఏళ్ల నాటి 'బోమ్ జీసస్’ నౌక..

భారత్ గ్లోబల్ స్కెచ్.. జపాన్, సౌత్ కొరియాతోనూ చర్చలు

కేవలం రష్యాతోనే కాకుండా, రేర్ ఎర్త్ అయస్కాంతాలను వాణిజ్యపరంగా తయారు చేయడానికి జపాన్, దక్షిణ కొరియా కంపెనీలతో కూడా ఐఆర్ఈఎల్ చర్చలు జరుపుతోంది. ఇవే కాకుండా అర్జెంటీనా, ఆస్ట్రేలియా మరియు మలావి దేశాలలో కూడా రేర్ ఎర్త్ మైనింగ్ అవకాశాలను భారత్ అన్వేషిస్తోంది. ఈ గ్లోబల్ నెట్‌వర్క్ ద్వారా 2029 నుంచి 2030 మధ్య కాలంలో భారతదేశంలోనే స్వయంగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఉత్పత్తిని ప్రారంభించాలని ఐఆర్ఈఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రోస్నెఫ్ట్ వంటి రష్యా ఇంధన రంగ సంస్థలపై అమెరికా కఠినమైన ఆంక్షలు విధించిన తరుణంలో.. భారత్ రష్యాతో జరుపుతున్న ఈ చర్చలు అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+