పాక్ తో సౌదీ డీల్ కలకలం..!అదే బాటలో ఖతార్, యూఏఈ? భారత్ అలర్ట్..!

పాకిస్తాన్ - సౌదీ అరేబియా మధ్య తాజాగా కుదిరిన రక్షణ ఒప్పందం భారత్ కు కలవరం పుట్టిస్తోంది. నిన్న సమావేశమైన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్-సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఒప్పందం చేసుకున్నాయి. ఇజ్రాయెల్ తాజాగా హమాస్ పేరుతో ఖతార్ రాజధాని దోహాలో జరిపిన దాడులపై అప్రమత్తమైన ముస్లిం దేశాలు నాటో తరహాలో తాము కూడా ఓ సంస్థను ఏర్పాటు చేసుకుని తమ ఉనికి కాపాడుకోవాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే పాక్-సౌదీ తొలుత ఒప్పందం చేసుకున్నాయి.

ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల్లో ఎవరిపై శత్రువు దాడి చేసినా దాన్ని రెండు దేశాలపై జరిగిన దాడిగానే భావిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. ఇవాళ విదేశాంగశాఖ ఈ ఒప్పందంపై తన అభ్యంతరాలను సౌదీ అరేబియాకు వెల్లడించింది. పాకిస్తాన్ తో చేసుకున్న ఒప్పందం విషయంలో సౌదీ అరేబియా భారత్ తో ఉన్న తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, పరస్పర ప్రయోజనాలు, సున్నితత్వాలను కూడా దృష్టిలో ఉంచుకుంటుందని భావిస్తున్నట్లు విదేశాంగశాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ తెలిపారు. ఇటీవలి కాలంలో సౌదీ అరేబియాతో పెరుగుతున్న భారత్ బంధాన్ని ఆయన గుర్తుచేశారు.

India Flags Concerns to Saudi Arabia on Pakistan Defence Pact as Qatar UAE Eye Similar plans

భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య విస్తృత శ్రేణి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్ జైశ్వాల్ తెలిపారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా పెరిగిందన్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం పరస్పర ప్రయోజనాలు, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుంటుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిణామం మన జాతీయ భద్రతకు, ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వానికి కలిగే ప్రభావాలను అంచనా వేస్తుందన్నారు.

India Flags Concerns to Saudi Arabia on Pakistan Defence Pact as Qatar UAE Eye Similar plans

మరోవైపు పాకిస్తాన్ తో రక్షణ ఒప్పందం చేసుకున్న సౌదీ అరేబియా తరహాలోనే ఇతర ఇస్లామిక్ దేశాలు ఖతార, యుఎఇ కూడా ఈ ఒప్పందంలో చేరడానికి చర్చలు జరుపుతున్నాయి. దీనిపైనా విదేశాంగశాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ స్పందించారు. భారతదేశం ఖతార్, యుఎఇ రెండింటితోనూ చాలా విస్తృతమైన సంబంధాలను కొనసాగిస్తుందని, సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయని జైస్వాల్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+