భారత్- చైనా వాణిజ్యం భేష్.. ఏకంగా 21 శాతం పెరిగిన దిగుమతులు
భారత్- చైనా మధ్య వాణిజ్యం ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగినట్లు స్పష్టం అవుతోంది. చైనా నుంచి భారత్ కు దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో దాదాపు 28 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఇది గణనీయమైన వృద్ధి అని నివేదికలు చెబుతున్నాయి. 2026 ఏప్రిల్, జూన్ మధ్య చైనా నుంచి భారత్ 38.04 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఈ సమాచారాన్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రచురించింది. గతేడాది ఏప్రిల్ నుంచి జూన్, 2025 మధ్య వాణిజ్యం చూస్తే 29.73 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది.
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో చైనా నుంచి భారత్ వస్తువుల దిగుమతులు 216 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ విలువ గతేడాదితో పోల్చితే ఏకంగా 19.89 శాతం పెరుగుదలగా భావించవచ్చు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో చైనాకు భారత్ ఉత్పత్తుల ఎగుమతులు 27.5 శాతం పెరిగి 5.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇక గతేడాది చైనాకు భారత్ ఎగుమతులు సుమారుగా 4.39 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
మరోవైపు భారత ఎగుమతులు మంచి వృద్ధి నమోదు చేసినప్పటికీ.. చైనా నుంచి దిగుమతులు భారీగా పెరగడంతో వాణిజ్య లోటు 67.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. చైనా నుంచి భారత్ మొత్తం దిగుమతులు ఏటా రెండంకెల స్థాయిలో పెరుగుతూ వస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో చైనా- భారత్ మధ్య వాణిజ్యం విలువ 101.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆ తర్వాత 2024-25 లో ఈ విలువ 11.5 శాతం పెరిగింది. 113.4 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో 16.5 శాతం వృద్ధితో ఈ విలువ 131.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ఇక చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకునే ఉత్పత్తుల్లో అత్యధిక శాతం ఎలక్ట్రానిక్ వస్తువులే ఉన్నాయి. వీటితోపాటు టెలికాం పరికరాలు, సెమీకండక్టర్లు, స్మార్ట్ ఫోన్ విడిభాగాలు, లిథియం- అయాన్ బ్యాటరీలు, ఇండస్ట్రీయల్ మెషీన్స్, కెమికల్స్, ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని భారత్.. చైనా నుంచి అధికంగా దిగుమతి చేసుకుంటోంది. అలాగే రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, ఆర్గానిక్ రసాయనాలు, వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, రత్నాలు వంటి వస్తువులను భారత్.. చైనాకు ఎగుమతి చేస్తోంది.












Click it and Unblock the Notifications