మా విజయానికి భారత్ కారణం: కొనియాడిన పెంటగాన్
వాషింగ్టన్: తమ దక్షిణ ఆసియా స్ట్రాటజీ విజయవంతంగా అమలు అవుతోందంటే అందుకు కారణం భారత్ అని అమెరికా ప్రశంసలు కురిపించింది. తమ దక్షిణాసియా వ్యూహంలో భారత్‌దే కీలకపాత్ర అని చెప్పింది.
ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు భారత్ చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడింది. ఉగ్రవాదాన్ని ఎలా నిర్మూలించాలనే విషయంలో ఎవరికైనా భారతే ఉదాహరణ అని పెంటగాన్ చీఫ్ అధికారిక ప్రతినిధి దానా వైట్ అన్నారు.

టెర్రరిజాన్ని తుదముట్టించేందుకు భాగస్వాములను భారత్ ఏకం చేస్తున్న తీరు చాలా గొప్పదని, భారత్ తీరునే తాము కూడా కొనసాగిస్తే లక్ష్యం నెరవేరుతుందన్నారు.
ఎన్నో రకాలుగా కలసి పనిచేసేలా భారత్‌తో తమకు సంబంధాలు ఉన్నాయని చెప్పారు. దక్షిణాసియా వ్యూహాన్ని అభివృద్ధి చేసేందుకు ఇండియా గొప్ప నిధిని కేటాయించిందన్నారు. ఏవియేషన్ మెయింటెనెన్స్ విషయంలోనూ భారత్ సహాయం చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications