క్రైమ్ కథా చిత్రం- కేరళ నర్సుకు మరణశిక్ష-అసలేం జరిగింది..?
యెమెన్‌లో నివాసముంటున్న ఓ కేరళ నర్సుకు ఆదేశ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. 2017లో యెమెన్ దేశానికి చెందిన ఆమె భర్తను హత్య చేసినట్లు నిర్థారణ కావడంతో ఆదేశాధ్యక్షుడు రషద్ ముహ్మద్ అల్-అలిమి మరణ శిక్ష వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకీ కేరళ నర్సు తన భర్తను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది..?
క్రైమ్ కథా చిత్రం
కేరళకు చెందిన 36 ఏళ్ల యువతి ప్రియా నిమీషా 2011లో నర్సుగా పనిచేసేందుకు తన భర్త, కుమార్తెతో కలిసి యెమెన్‌కు వెళ్లింది. ఆదేశ రాజధాని సనాలో నర్సుగా ఉద్యోగం చేసేది.క్రమంగా వారి కుటుంబానికి ఆర్థిక కష్టాలు వచ్చాయి.దీంతో 2014లో ప్రియా భర్త కూతురు ఇద్దరూ భారత్‌కు తిరిగి వచ్చారు. అయితే ప్రియా మాత్రం యెమెన్‌లోనే ఆగిపోయింది. ఇక యెమెన్‌లో అంతర్యుద్ధం కారణంగా ప్రియా తన భర్త కూతురితో కలిసింది లేదు.ఇక తన బతుకుదెరువు కోసం యెమెన్‌లోనే తలాల్ అబ్దో మహ్ది అనే మరో వ్యక్తితో కలిసి ఒక క్లినిక్‌ను ప్రారంభించింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది.

ప్రియాను టార్చర్ పెట్టిన మహ్ది
మహ్ది కొన్ని డాక్యుమెంట్లను మానిపులేట్ చేసి ప్రియా తన భార్యగా అందులో చేర్చాడు. ఆ తర్వాత మహ్ది తనను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు గురిచేసేవాడని ప్రియా చెప్పుకొచ్చింది. తనను చిత్రహింసలకు గురిచేసేవాడని పేర్కొంది.అంతేకాదు తన పాస్‌పోర్టును కూడా మహ్ది లాగేసుకున్నాడని వెల్లడించింది. తన క్లినిక్ పై వచ్చే డబ్బులు మొత్తాన్ని ఇవ్వాలని టార్చర్ పెట్టేవాడని, డ్రగ్స్ కూడా ఇచ్చేవాడని తెలిపింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా తాను ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.అయితే మహ్దిపై చర్యలు తీసుకోవడం పోయి, పోలీసులు తనను అరెస్టు చేసినట్లు వెల్లడించింది ప్రియా.
అందుకే చంపేశాను
2017లో తాను అనుభవిస్తున్న ఈ నరకం నుంచి తప్పించుకుని మహ్ది వద్ద ఉన్న తన పాస్‌పోర్టు ఎలాగైనా దక్కించుకోవాలని భావించిన ప్రియా, స్థానిక జైలు వార్డన్ సహాయంతో పాటు సలహా కోరింది. దీంతో మహ్దికి క్రమంగా మత్తు మందునిచ్చి నిస్సహాయుడిని చేయాలని ఆ జైలు వార్డన్ సలహా ఇచ్చాడు. దీంతో ప్రియా ఆపని ప్రారంభించింది. మహ్దికి మత్తు మందు ఇవ్వడం ప్రారంభించింది. అది కాస్త ఓవర్ డోస్‌గా మారి మహ్ది ప్రాణాలు తీసింది.ఆ తర్వాత ఏం చేయాలో తోచక మహ్ది శరీరాన్ని ముక్కలుగా చేసి ఓ ట్యాంకులో పడేసింది. దీంతో ప్రియాపై హత్య కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేశారు.
నిందితురాలని కోర్టులో ప్రవేశపెట్టగా తనను చిత్రహింసలకు గురిచేశాడని మహ్ది దగ్గరున్న పాస్‌పోర్టును తిరిగి తీసుకునేందుకే ఇలా చేసినట్లు ప్రియా ఒప్పుకుంది. ఇక ఆ దేశాధ్యక్షుడు అల్-అలిమి కూడా ప్రియా మరణశిక్షకు ఆమోదం తెలపడంతో మరో నెలరోజుల సమయంలో ఆమెను ఉరి తీసే అవకాశం ఉంది. ఈ లోగ ప్రియా తల్లి యెమెన్‌కు చేరుకుని తన కూతురును రక్షించుకునేందుకు మహ్ది కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతోంది. తమకు జరిగిన నష్టాన్ని పూడ్చలేమని అయితే కొంతవరకు డబ్బులు చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఇక భారత ఎంబసీ కూడా అక్కడి లాయర్ అబ్దుల్లా అమీర్‌ను రంగంలోకి దింపింది. ఆయన రూ.16.7 లక్షలు ఫీజుగా డిమాండ్ చేశారు. అయితే డబ్బులు పూర్తిగా అందకపోవడంతో ప్రస్తుతానికి చర్చలకు బ్రేక్ పడింది.
ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం ప్రియా నిమీషాను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు.ప్రియాకు ఏమి కాదని కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని చెప్పారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications