పాకిస్తాన్ కు 800 మిలియన్ డాలర్లా ? భారత్ తీవ్ర అభ్యంతరాలు..!
పహల్గాం ఉగ్రదాడికి ముందు పీకల్లోతు ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆపరేషన్ సింధూర్ కు కౌంటర్ ఇచ్చేందుకు సైతం డబ్బుల్లేకుండా ఇబ్బందులు పడిన పాకిస్తాన్ కు అంతర్జాతీయ స్ధాయిలో బ్యాంకులు ఆఫర్ల పంట పండిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలోనే పాకిస్తాన్ కు 4 బిలియన్ డాలర్ల సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకు రాగా.. ఇప్పుడు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏకంగా 800 మిలియన్ డాలర్ల సాయం అందించేందుకు సిద్దమవుతోంది.
ఉగ్రవాదానికి మద్దతిస్తూ, ఆర్ధికంగా అస్తవ్యస్ధ విధానాలు అమలు చేస్తున్న పాకిస్తాన్ కు ఇలా అంతర్జాతీయ బ్యాంకు అయిన ఏడీబీ 800 మిలియన్ డాలర్ల అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై భారత్ ఇవాళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే పెట్టిన షరతుల్ని పూర్తిగా అమలు చేయకపోవడంతో పాటు తీవ్రవాదానికి మద్దతు కూడా ఆపలేదని భారత్ ఏడీబీకి గుర్తుచేసింది.

పాకిస్తాన్ లో అభివృద్ధి కోసం అంతర్జాతీయ సంస్థలు ఇస్తున్న నిధుల్ని మిలటరీ అవసరాల కోసం వాడేస్తూ, ఆర్ధిక సంస్కరణలు కూడా అమలు చేయని పరిస్దితులో ఇంత పెద్ద మొత్తాలు ఎలా ఇస్తున్నారని ఏడీబీని భారత్ ఇవాళ ప్రశ్నించింది. పాకిస్తాన్ లో పన్ను ఆదాయాలు తగ్గిపోవడం, సంస్కరణలు అమలు చేయకపోవడం, ఆర్ధిక అస్తవ్యస్ధ నిర్వహణ పరిస్ధితుల్ని ఏడీబీకి భారత్ గుర్తుచేసింది. అదే సమయంలో రక్షణ రంగంపై పెట్టే ఖర్చును అమాంతం పెంచడాన్ని సైతం గుర్తుచేసింది.

2018 ఆర్ధిక సంవత్సరంలో 13 శాతంగా ఉన్న పాకిస్తాన్ జీడీపీ 2023 నాటికి 9.2 శాతానికి తగ్గిపోయిన విషయాన్ని సైతం ఏడీబీకి భారత్ గుర్తుచేసింది. పాకిస్తాన్ కు ఇస్తున్న నిధుల్ని పక్కదారి పక్కగుండా చూడాల్సిన అవసరం కూడా ఉందని భారత్ తెలిపింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ పాకిస్తాన్ కు 24వసారి ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చినా దేశంలో అభివృద్ధికి దాన్ని వాడుతున్న ఆనవాళ్లు కనిపించడం లేదని, అదే సమయంలో మిలటరీ బడ్జెట్ పెరగడం చూస్తుంటే నిధులు పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోందని భారత్ తెలిపింది.












Click it and Unblock the Notifications